అందరూ ఎప్పుడెప్పుడా అని వాస్తవం బుజ్జి రానే వచ్చేసింది. బుధవారం బుజ్జిని అందరికీ పరిచయం చేశారు పాన్ ఇండియా హీరో ప్రభాస్. భైరవగా ‘కల్కి 2898 ఎడి’ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ తన వెహికిల్ బుజ్జిని డ్రైవ్ చేస్తూ తన అభిమానుల కోసం గ్రౌండ్‌లో చక్కర్లు కొట్టారు. వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కల్కి’. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ కోరికనే సినిమాలో కీలక పాత్ర పోషించిన బుజ్జిని పరిచయం చేస్తామంటూ గత కొన్ని రోజులుగా చెబుతూ వచ్చారు. దీని కోసం చాలా పెద్ద ఈవెంట్‌ని ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేశారు.
బుజ్జిని పరిచయం చేసిన తర్వాత డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ ‘ఏదో మా డార్లింగ్స్‌కి హాయ్ చెప్పేసి వెళ్లిపోదామనుకుంటే… ఈ కారు, ఫీట్లు చేయించుకున్నాడు నాగి. బుజ్జితో నన్ను మూడు సంవత్సరాలు టార్చర్ పెట్టాడు. అయినా బుజ్జితో సో ఎక్సైటింగ్. నేను కూడా టీజర్, సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను’ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ మాట్లాడుతూ ‘ఎంజాయ్ చేశారా.. ఎలా ఉంది బుజ్జి. అమితాబ్ సర్‌తో, కమల్‌సర్‌తో పనిచేయడం నిజంగా హ్యాపీ. ఈ సినిమా చేసినందుకు కమల్ సర్‌కి వంద దండాలు. థాంక్యూ సర్. హోల్ ఇండియా ఇన్‌స్పైర్ అయింది వీళ్ళిదర్నీ చూస్తే. లక్కీగా నాకు వారిద్దరితో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఈ విషయంలో నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. నార్త్ నుంచి వచ్చి ఇంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఒక్క అమితాబ్ సర్‌కే. అలాంటి నటుడు మన ఇండియాలో ఉన్నందుకు ఇండియా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అందరం ఆయన ఇన్‌స్పిరేషన్‌తోనే వచ్చాం. చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసి నాకు అలాంటి బట్టలు కావాలి అని అడిగి మరీ కుట్టించుకున్నాను. అలాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో వర్క్ చేశాను. దీపిక మోస్ట్ గాడ్జియస్. దిశ హాట్‌స్టార్. ఇక నిర్మాత దత్‌గారు ఈ ఏజ్‌లో కూడా ఎంతో హుషారుగా ఉన్నారు. బడ్జెట్ గురించి ఎలాంటి భయం లేదు అయనకి. ఇంకా బాగా రావాలంటే తపనే ఉంటుంది తప్ప మరో విషయం గురించి ఆయన ఆలోచించరు. ఆయన పిల్లలు స్వప్నగారు, ప్రియాంకగారు కూడా అదే ధైర్యంతో పనిచేస్తారు. అలాగే బుజ్జిని పరిచయం చేసిన నాగిగారికి, అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ థియేటర్స్‌లో కలదాం. లవ్ యు డార్లింగ్స్’ అన్నారు.