కమల్ హాసన్ (కమల్ హాసన్) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఇండియన్’ (భారతీయుడు) చిత్రం 1996లో విడుదలై సంచలన విజయం సాధించింది. 28 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఇండియన్-2’ (భారతీయుడు-2) రాబోతుంది. కమల్-శంకర్ కాంబినేషన్ లో జులై 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలకు ఇంకా ఏడు వారాల సమయం ఉండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. తాజాగా మొదటి సాంగ్ ను విడుదల చేశారు. (భారతీయుడు 2)
‘భారతీయుడు’ కోసం ఎ. ఆర్. రెహమాన్ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఆ పాటలు మారుమోగిపోతుంటాయి. అయితే ఈసారి ‘భారతీయుడు-2’ కి మ్యూజిక్ చేసే అవకాశం అనిరుధ్ ని వరించింది. ప్రస్తుతం అనిరుధ్ టాప్ ఫామ్ లో కనిపిస్తుంది.. ఇది నిజంగా బిగ్ టాస్క్ అన్నట్లే. ఎందుకంటే రెహమాన్ ని మరిపించేలా మ్యూజిక్ ఇవ్వాలి. మొదటి సాంగ్ వింటుంటే అనిరుధ్ బాగానే న్యాయం అనిపిస్తోంది. (భారతీయుడు 2)
‘భారతీయుడు-2’ నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘సౌర’ అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్ గూస్ బాంప్స్ తెప్పించేలా ఉంది. తెల్లోడిపై తెలుగోడి తిరుగుబాటు అన్నట్టుగా సాగిన లిరిక్స్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి. సింగర్ రితేష్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఈ పాటను ఆలపించాడు. మరి ఈ సాంగ్ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.