బాలీవుడ్ హీరో, కేకేఆర్ కో-ఓనర్ షారుఖ్ ఖాన్‌కు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. మొదట్లో వడదెబ్బతో అస్వస్థతకు గురై.. షారుఖ్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా తెలుస్తున్న సమాచారం షారుఖ్‌కు వడదెబ్బతో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు సమాచారం. కాగా, ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. షారుఖ్ వడదెబ్బ, అధిక వేడి కారణంగా కాస్త అస్వస్థతకు గురైనట్లు మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం ఉంది. ఇదే ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ హార్ట్ స్ట్రోక్ విషయం బయటికి రావడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు.
లీగ్ దశలో 9 విజయాలతో టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరిన కేకేఆర్ ఈ మ్యాచ్ చూసేందుకు షారుఖ్ ఖాన్ కూడా స్టేడియానికి వచ్చారు. అయితే.. కేకేఆర్ మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లోకి వెళ్లిన షారుఖ్ ఖాన్.. కేకేఆర్‌ని ప్రశంసించారు. ఈ మ్యాచ్ తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరారు. మొదట అధిక, వడ దెబ్బతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది.. దాంతో పాటే మైల్డ్ స్ట్రోక్ హార్ట్ వచ్చినట్లు వేడి.
ప్రస్తుతం షారుఖ్‌కు అత్యాధునికి వైద్య సేవలు అందుతున్నాయి. ఆయనకు ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. షారుఖ్ ఉన్న హాస్పిటల్ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమన అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని, షారుఖ్ స్నేహితురాలు అయిన జూహీ చావ్లా ఆసుపత్రిలో ఉంటూ.. ఆయనకి అందుతున్న వైద్య సేవను దగ్గరుండి చూస్తోంది. మరి షారుఖ్‌కు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#చూడండి | గుజరాత్: నటుడు షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈరోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుపత్రికి చేరుకున్నారు.
హీట్ స్ట్రోక్ మరియు డీహైడ్రేషన్ కారణంగా షారూఖ్ ఖాన్ ఆసుపత్రిలో చేరాడు. pic.twitter.com/hTrCZ42x1F
– ANI (@ANI) మే 22, 2024