మొన్న బెంగుళూరు (బెంగుళూరు) లో జరిగిన రేవ్ పార్టీ (రేవ్ పార్టీ) విషయం ఎంతగా సంచలనం సృష్టించిందో అందరకీ తెలుసు. పలువురు సినీ సెలబ్రిటీస్ అందులో పాల్గొన్నారని పేరు వచ్చింది. అందులోను మరి ముఖ్యంగా ప్రముఖ నటి హేమ (హేమ)కూడా ఉండటంతో కేసు ఆసక్తిగా మారింది. ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటకి వచ్చాయి
హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు నిర్దారించారు. ఆమె రక్త నమూనాలని పరీక్షకి పంపించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ మేరకు బెంగుళూరు పోలీసులు అధికారకంగా ప్రకటించారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. అలాగే ఆ పార్టీలో పాల్గొన్న ఎనభై ఏడు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. అంత మంది కలిసి ఒక పార్టీ లో డ్రగ్స్ తీసుకోవడం అందరికి పాజిటివ్ రావడం ఇదే తొలిసారి కావచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మరికొంత సినీ మంది, రాజకీయ ప్రముఖులు కూడా వీరిలో ఉన్నారు. వాళ్ల పేర్లు కూడా త్వరలోనే రానున్నాయి
ఇక హేమ డ్రగ్స్ కేసులో పట్టుబడిన దగ్గర్నుంచి నేను రేవ్ పార్టీ లో లేనని చెప్పుకుంటూ వస్తుంది. హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పడంతో పాటు తన ఇంట్లోనే బిర్యానీ కూడా తయారు చేసి వీడియోలు చేసింది. ఈ విషయం మీద కూడా పోలీసులు సీరియస్ గా ఉన్నారు.1989 లో సినీ రంగ ప్రవేశం చేసిన హేమ ఇప్పటివరకు నూతన తొంబై చిత్రాలకి పైనే చేసింది