చాలా వరకు సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయిన రోజులకే ఓటీటీ లోకి వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో అయితే, కనీసం నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీ లోకి అడుగుపెడుతున్నాయి. ఈ ఇప్పటికే ఎన్నో సినిమాల మూవీ లవర్స్ ను ఆశ్చర్య పరచగా, ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించి అప్పడే బజ్ నడుస్తుంది. తాజాగా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్స్ గురించి చూసేశాము. ఇక ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మరొక సినిమా ఓటీ అప్ డేట్ వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.
బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు లేటెస్ట్ గా నటించిన సినిమానే “లవ్ మీ”. ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి, వైష్ణవి జంటగా నటించారు. కాగా ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా మే 25 న థియేటర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. మరి ఈసారి వైష్ణవి చైతన్య ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే.. డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ ఆహ లో స్ట్రీమింగ్ ఫార్మ్. మరి ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ ఎప్పుడో వేచి చూడాలి.
ఇక ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ను గమనిస్తే.. ఇది హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే లవ్ స్టోరీల అనిపిస్తోంది. మనం ఇప్పటివరకు ఎన్నో లవ్ స్టోరీస్ ని చూసి ఉంటాం కానీ, ఈ సినిమాలో లవ్ స్టోరీ మాత్రం మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను బట్టి చూస్తే. హీరో ఓ దెయ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. భయమేసే చోట రొమాన్స్ ఇంకా ఎక్సయిటింగ్ గా ఉంటుందంటూ .. ఓ భవనంలోకి ఎంటర్ అవుతాడు. ఆ దెయ్యం కంట పడితే చంపేస్తుందని హీరోయిన్ చెప్పినా .. వినడు. ఆ దెయ్యాన్ని చూడాలని అనుకుంటాడు. ఎలా అయినా దెయ్యాన్ని ప్రేమలో పడుతుందని అనుకుంటాడు. మరి, ఇంతకీ ఆ దెయ్యం ఎవరు ? హీరో దెయ్యాన్ని ప్రేమలో పడేస్తాడా లేదా ! అసలు హర్రర్ లవ్ స్టోరీ వెనుక దాగి ఉన్న కథ ఏంటి ! ఇలాంటి ప్రశ్నలకు తెలుసుకోవాలంటే .. ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.