జూన్ 4వ తేదీ దగ్గర పడే కొద్దీ అల్లు అర్జున్ (allu arjun)అభిమానుల్లో టెన్షన్ ఎక్కువైంది. పుష్ప 2 (పుష్ప 2)రిజల్ట్ విషయంలో టెన్షన్ పడటానికి ఆగస్టు దాకా టైం ఉంది కదా అని అనుకుంటున్నారా. మీరు అనుకునేది నిజమే. కానీ ఆ టెన్షన్ పుష్ప గురించి కాదు.. అంతకు మించి..
ఆంధ్రప్రదేశ్ లో మొన్న పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల్లో బన్నీ తన స్నేహితుడైన శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి తరుపున ప్రచారానికి వెళ్ళాడు. రాయలసీమలోని నంద్యాల అసెంబ్లీ కి అధికార వైసిపి పార్టీ తరుపున శిల్పా పోటీ చేసాడు. ఆయన గెలుపుని కోరుతూ ర్యాలీ కూడా చేసి శిల్పా కి ఓటు వెయ్యాలని బన్నీ ప్రజలకి విజ్ఞప్తి చేసాడు. ఇంతవరకు బాగానే ఉంది.కానీ ఒక వేళ శిల్పా ఓడిపోతే మా బన్నీ పరిస్థితి ఏంటి అనే దిగులు ఫ్యాన్స్ లో మొదలయ్యింది. ఎందుకంటే తెలుగుదేశం తో మిళితమైన కూటమి అధికారంలోకి రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.
ఈ విషయాన్నీ దాదాపుగా అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అదే టైంలో వైసిపి చిత్తు చిత్తుగా ఓడిపోనుందని కేవలం ఇరవై లోపు స్థానాలే వస్తాయని స్పష్టం చేస్తున్నారు.దీంతో ఆ ఇరవై స్థానాల్లో నంద్యాల లేకపోతే బన్నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే బెంగతో ఉన్నారు. అది పుష్ప 2 కలెక్షన్స్ మీద కూడా ప్రభావం చూపించిందని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో చర్చ కూడా నడుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr)కొడాలి నాని, వల్లభనేని వంశీ లు చాలా మంచి స్నేహితులు. ఎన్టీఆర్ తో ఆ ఇద్దరు సినిమాలు కూడా నిర్మించారు.ఆ ముగ్గురు కలిసి ఉన్న ఫొటోస్ ని చూస్తే వాళ్ళ స్నేహం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. అలాంటి ఎన్టీఆర్ నే ఆ ఇద్దరు మొన్న ఎలక్షన్స్ లో పోటీ చేస్తే ప్రచారానికి వెళ్ళలేదు. అలాంటిది బన్నీ అనవసరంగా వెల్లాడేమో అని కొంత మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పైగా బన్నీ శిల్పకి అంత ఫ్రెండ్ షిప్ లేదని కూడా చెప్తున్నారు