చాలా వరకు సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయిన రోజులకే ఓటీటీ లోకి వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో అయితే, కనీసం నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీ లోకి అడుగుపెడుతున్నాయి. ఈ ఇప్పటికే ఎన్నో సినిమాల మూవీ లవర్స్ ను ఆశ్చర్య పరచగా, ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించి అప్పడే బజ్ నడుస్తుంది. తాజాగా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్స్ గురించి చూసేశాము. వాటితో పాటు రేపో మాపో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్స్ విషయాలు కూడా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అసలు రిలీజ్ డేట్ కూడా ఇంకా క్లారిటీ రాణి ఓ బడా హీరో సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్ గురించి బజ్ నడుస్తుంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా “కూలీ”. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. సూపర్ స్టార్ రజిని కాంత్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీకి ఎన్నో మంచి హిట్స్ అందించారు సూపర్ స్టార్ రజిని కాంత్. ఇక ఇప్పుడు కూలీ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లో 171వ చిత్రంగా నిలిచిపోనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తయితే కనుక.. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీగా అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కు.. బాగానే స్పందన లభించింది. దీనితో ఈ సినిమాపై అందరికి అంచనాలు బాగానే పెరిగాయి. మరి ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో చూడాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి అప్పుడప్పుడు టాక్ నడుస్తూనే ఉంది. అంతే కాకుండా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.