దక్షిణ ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో ఈ ఏడాది జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ఉంది. ఈ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రపంచ వ్యాప్తంగా విచ్చేస్తున్న ప్రముఖులు, సినీ తారలు భారత దేశం నుంచి సందడి చేశారు. ప్రతి సంవత్సరం ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెడ్ కార్పేట్ పై సందడి చేస్తారు. ఈ ఏడాది కియార అద్వాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శోభితా ధూళిపాళ ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్ పై తమ అందాల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల కేన్స్‌లో అధికారిక ఎంపికలో భారతీయ చిత్రాల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కేన్స్‌లో ఇండియన్ మూవీకి ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది.. ఇంతకీ ఏ సినిమాకు ఆ ఫ్రైజ్ వచ్చిందన్న విషయం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.
కేన్స్ లో నగరంలో ప్రారంభమైమన 77వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ఎంతో వైభవంగా కనిపిస్తోంది. భారత దేశం నుంచి అందాల తారలు రెడ్ కార్పెట్ పై తమ దుస్తులతో ఆకర్షితులయ్యారు. వీరిలో ఐశ్వర్యరాయ్, కియార అద్వాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శోభితా ధూళిపాళ ఉన్నారు. ఇదిలా ఉంటే కేన్స్ – 2024 లో ఉత్తమ లఘు చిత్రంగా ఇండియన్ షార్ట్ ఫిల్మ్ బహుమతి సొంతం చేసుకుంది. చిదానందించిన ‘సన్ ఫ్లవర్స్ ద ఫస్ట్ వన్ టు’ ప్రపంచ వ్యాప్తంగా 17 చిత్రాలతో పోటీపడి తొలి స్థానంలో నిలిచింది. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిమ్ ని ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు.
కథ విషయానికి వస్తే.. ఓ వృద్దురాలి కోడిని ఎవరో దొంగిలిస్తారు.. దాన్ని ఆవిడ పడ్డ కష్టాలు.. తపన ఎలా ఉంటుందో ఈ షార్ట్ ఫిల్మ్‌లో రూపొందించాడు దర్శకుడు. ఈ షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్ తో పోటీ పడి మరీ ఫస్ట్ ఫ్రైజ్ గెల్చుకోవడం పై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. తాము పడ్డ కష్టానికి మంచి ప్రతిఫలం దక్కింది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు టీమ్ సభ్యులు. మేరఠ్ లో జన్మించిన భారతీయ నిర్మాత మహేశ్వరి రూపొందించిన యానిమేటడ్ చిత్రం ‘బన్నీ హుడ్’ పోటీలో నిలబడి తృతీయ బహుమతి గెల్చుకుంది. మే 23న బునుయెల్ థియేటర్‌లో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.బెస్ట్ షార్ట్ ఫిలిమ్ మూవీకి 15,000 యూరోలు, తృతీయ స్థానానికి 7,500 యూరోలు అందించబడతాయి. ఇదిలా ఉంటే మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ టీజర్ ని ప్రదర్శించారు.