సిల్వర్ స్క్రీన్ వద్ద మోస్ట్ లక్కీయస్ట్ హీరోయిన్ ఎవరంటే కమల్ డాటర్ శృతి హాసన్ (శృతి హాసన్) అని చెప్పవచ్చు.ఆ మాటకొస్తే వరల్డ్ మొత్తం మీదనే లక్కీయస్ట్ హీరోయిన్. ప్లాపుల్లో ఉన్న హీరో తన సినిమాలో శృతిని ఫిక్స్ చేస్తే చాలు ఇక ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. అంతటి కీర్తి ఉన్న శృతి ముంబై నడివీధుల్లోనే రిప్లై ఇవ్వవలిసిన పరిస్థితి వచ్చింది.
శృతి రీసెంట్ గా చెన్నై నుంచి ముంబైకి వచ్చింది. ముంబైలోని ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఎలాంటి చిరాకుని ప్రదర్శించకుండా హాయిగా ఫోన్ ఓపెన్ చేసి అభిమానులతో ముచ్చటించింది. ఇన్ స్టా వేదికగా జరిగిన ఈ ముచ్చట్లలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. బాధల్లో ఉంటే ఏం చేస్తావ్ అని ఒక అభిమాని అడిగాడు. ఎక్కువగా ఏడ్చేస్తా.బట్ ఉదయాన్నే లేచేసరికి అంతా మర్చిపోయి కొత్తగా స్టార్ట్ చేస్తాను. రీసెంట్‌గా నీ జీవితంలో జరిగిన వికృతమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యే నా జీవితంలో అతి దారుణమైన సంఘటన జరిగింది.
వెంటనే దాని నుంచి బయటపడి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అలాగే సింగీలా కమిటెడా? ఈ విషయంలో మాత్రం నేను సమాధానం చెప్పాలనుకోవడం లేదు.కానీ ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను. నాట్ విల్లింగ్ టు మింగిల్ అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. అదే విధంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పింది..ముంబైలో వాతావరణం ఎలా ఉందో అని కూడా అడిగితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే ట్రాఫిక్ కదిలింది అని చాటింగ్ ముగించుకుంది
ఇప్పుడు ఈ చాటింగ్‌తో శృతి తన బాయ్ ఫ్రెండ్ శంతనుతో బ్రేక్ అప్ అయినప్పటి నుంచి కోలుకుందని చెప్పుకోవచ్చు.ఎందుకంటే గత కొన్నేళ్లుగా శంత నే లోకంగా బతికింది. విడిపోయాక కొన్ని రోజులు బయటకి కూడా రాలేదు. సోషల్ మీడియాలో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో అందరు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లారని అనుకున్నారు. శృతి ప్రస్తుతం తెలుగులో అడవిశేషు హీరోయిన్ గా వస్తున్న డెకాయిట్ లో చేస్తుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతున్న ఈ మూవీ అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి