బుల్లితెర నుండి వెండితెర మీదకు ఎగసి పడ్డ అందం అనసూయ భరద్వాజ్. ఆమె నటి మాత్రమే కాదు న్యూస్ ప్రజెంటర్, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. ఆమెలో సింగర్ కూడా దాగి ఉంది. ఓ షోలో అద్భుతంగా పాడి మెస్మరైజ్ చేసింది. జబర్దస్త్ షోలో యాంకరమ్మగా అలరించి ఆకట్టుకుంది. సుమారు దశాబ్ద కాలం పాటు బుల్లితెర ప్రేక్షకులను తన అందంతో మెస్మరైజ్ చేసింది. వెండితెరపైకి అడుగుపెట్టి సత్తా చాటుతుంది. ఆమె క్రేజ్‌కు అవేమీ అడ్డు కాలేకపోయాయి. ఇక సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో రచ్చ లేపుతూ ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన ఓ ఫోటో నెట్టింట్లో షేక్ చేస్తుంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు జరుపుకున్న సంగతి విధితమే.
సినిమా షూటింగ్‌కి కాస్త గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది ఈ బ్యూటీ. ఈ విషయాన్ని షేర్ చేస్తూనే ఉంది . ప్రస్తుతం సిక్కింలో చిల్ అవుతుంది అనసూయ. మొన్న భర్త, పిల్లలతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లింది. మరుసటి రోజు అక్కడ నదిలో తడిసి ముద్దవుతూ కనువిందు చేసింది. ఇప్పుడు మరో ట్వీట్‌తో నెటిజన్లకు కాక పుట్టిస్తోంది. వాటర్ ఫాల్‌లో ఎంజాయ్ చేస్తున్న షేర్ చేసుకున్న అనసూయ.. ‘మరో రోజు.. మరో ట్రెక్, మరో అందమైన మౌంటెన్ ఫారెస్ట్ ఫాల్. అద్భుతంగా ఉంది. మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవి’ అంటూ రాసుకొచ్చింది. కాగా, ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్ చూసి హాట్ సింబల్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. అంతకు ముందు కొంత మంది నెటిజన్లు.. బికినీ వేయొచ్చు కదా అంటూ కామెంట్స్ చేశారు.
ఇప్పుడు అలాంటి దుస్తుల్లోనే హీట్ పుట్టిస్తోంది అనసూయ భరధ్వాజ్. బ్లాక్ టాప్, పింక్ స్కట్ వేసుకుని దర్శనమిచ్చింది. అందులో ఆమె ఎదపై ఉన్న టాటూ కని, కనిపించక కనిపిస్తుంది. కాగా, అనసూయ ఇలాంటి భాగస్వామ్యం ఎప్పుడు చేయడం కొత్త కాదు.. ఇలాంటి టూర్స్ ప్లాన్ చేసినప్పుడల్లా షార్ట్ దుస్తుల్లో కనిపిస్తూ సెగలు పుట్టిస్తూ ఉంటుంది అమ్మడు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే..అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో కనిపించబోతున్న సంగతి విదితమే. ఇటీవల ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. మరింత మాస్ లుక్స్‌లో దర్శనమిచ్చింది. ఈ ఏడాది రజాకార్ అనే మూవీలో కూడా పోచమ్మ పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఫ్లాస్ బ్యాక్ అనే తమిళ మూవీ మాత్రమే ఉంది.