ఒకప్పుడు సినిమాలు అంటే.. నిర్మాత అనుకున్న బడ్జెట్ ప్రకారం తెరకెక్కేవి. ఖర్చు విషయంలో అతడి మాటే ఫైనల్ అన్నట్లుగా. మరి నేటి కాలంలో సినిమా నిర్మాణం అంటే భరించలేనంత ఖర్చుగా మారింది. ఎంత చిన్న సినిమాకైనా సరే.. భారీగా ఖర్చు చేస్తున్నారు. చేస్తే చేశారు.. రిజల్ట్ ఏమైనా అదే స్థాయిలో వస్తుందా అంటే లేదు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రదర్శించిన చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేస్తున్నాయి. పెట్టిన బడ్జెట్‌లో కనీసం పావు వంతు కూడా తిరిగి రావడం లేదు. ఏవో అక్కడక్కడ ఒకటి, రెండు సినిమాలు తప్ప.. చాలా వాటి విషయంలో బడ్జెట్ కాదు కదా.. కనీస పెట్టుబడి కూడా రావడం లేదు. ఈక్రమంలో ఓ ఇండియన్ మూవీ బడ్జెట్.. అది సాధించిన కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే.. వందల కోట్ల రూపాయల బడ్జెట్ కచ్చితంగా అనే అభిప్రాయం పాతుకుపోయింది. ఈక్రమంలో ఓ స్టార్ హీరో సినిమా కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెనకెక్కి.. ఏకంగా 60 శాతం లాభాలు అంటే.. 900 కోట్ల రూపాయల వసూళ్లు. ఇంతకు అది ఏ సినిమా.. అందులో హీరో ఎవరు అనే వివరాలు మీ కోసం..
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమిర్ ఖాన్ సినిమాలంటే.. విభిన్నమైన కథాంశాలు మాత్రమే కాక.. మంచి వసూళ్లు సాధిస్తాయి అని జనాలు నమ్ముతారు. ఇక అమీర్ ఖాన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అనగానే అందరికి దంగల్ గుర్తుకు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే అమీర్ కెరీర్‌లో అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా ఇదేనా అంటే కాదు.. అమిర్ కెరీర్‌లో అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన భారీ లాభాలు ఆర్జించిన చిత్రం మరొకటి ఉంది.. అదే సీక్రెట్ సూపర్ స్టార్. 2017లో వచ్చిన ఈ చిత్రం.. కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో విడుదలైంది.. అది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 900 కోట్లు వసూలు చేసింది. అంటే పె ట్టిన బడ్జెట్ కన్నా.. 60 రెట్లు ఎక్కువ వసూళ్లు రావడం విశేషం.
ఈ సినిమా అమీర్ ఖాన్ సొంత ప్రొడక్షన్ హౌస్‌లోనే నిర్మించారు. జైరా వసీం అనే నటి ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. భారీ యాక్షన్ సీన్స్, వంటివేవి గ్రాఫిక్స్ లేవు. అసలు హీరో లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 900 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి.. అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్‌లో యాక్ట్ చేశాడు. 15 ఏళ్ల వయసున్న జైరా వసీం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.
హీరోలు లేని ఈ సినిమా ఇంత భారీ మొత్తంలో కలెక్షన్స్ సాధించడం నిజంగా రికార్డు. ఆ సమయానికి దంగల్, బాహుబలి 2 మాత్రమే ఈ సీక్రెట్ సూపర్ స్టార్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించాయి. ఆ లెక్కన ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెసైందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీలో అందుబాటులో ఉంది.