హాలీవుడ్ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకుని బిగ్ బాస్ రియాలిటీ షోగా ఇండియాలోకి తీసుకొచ్చారు. నిజానికి ఈ షో ఏ భాషలో అయితే స్టార్ట్ ఆ భాషలో సూపర్ సక్సెస్ అయ్యింది. అన్ని భాషల్లో మోస్ట్ వ్యూవర్ షిప్, ఫ్యాన్ బేస్ ఉన్న షోగా ప్రేక్షకాదరణ పొందింది. అటు తెలుగులో కూడా ఈ షోకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. అలాగే ఓటీసీ సీజన్ కూడా పూర్తయింది. మరి హిందీలో అయితే ఈ బిగ్ బాస్ కి విశేష ఆదరణ ఉంది. ఇప్పుడు హిందీలో కొత్త ఓటీటీ సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఆ పరిశీలన అధికారికంగా ప్రకటన చేశారు. ఇంకా.. ఈసారి హోస్ట్ ని కూడా మార్చేస్తున్నారు.
బిగ్ బాస్ షోకి బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉంది. ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారికి బయట మంచి ఫాలోయింగ్ పెరగడమే కాకుండా.. ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది. అందుకే ఈ బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు అంతా ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఆ షోలో పాల్గొనే ఛాన్స్ వస్తే.. భారీగా రెమ్యూనరేషన్ దక్కడమే కాకుండా.. షాస్ట్ గా ఫేమస్ కూడా అయిపోతారు. ఇలాంటి బిగ్ బాస్ షోకి 2010 నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకి కొత్త హోస్ట్ ని చూడబోతున్నాం అంటూ వార్తలు వస్తున్నాయి.
అది కూడా కొత్త సీజన్ స్టార్ట్ అవుతోంది అని ప్రకటించిన తర్వాత బిగ్ బాస్ షోకి హోస్ట్ కూడా మారబోతున్నాడు అంటూ చెబుతున్నారు. అయితే ఇది మెయిన్ సీజన్ కి కాదు. బిగ్ బాస్ ఓటీటీలో కొత్తగా సీజన్ 3 రాబోతోంది అంటూ జియో సినిమా వాళ్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఈ హోస్ట్ ఛేంజ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3కి అనీల్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు అంటూ చెబుతున్నారు.
అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న హోస్ట్ ఛేంజ్ వార్త అధికారిక ప్రకటన కాదు. అలాగే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం చెప్పలేదు. కానీ, త్వరలోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ప్రస్తుతం కంటెస్టెంట్స్ వేటలో ఉన్నారని. ఈసారి బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3ని చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో తెలుగు ఆడియన్స్ మరి.. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సంగతి ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.