ఆర్జీవీ ఎవరైన అమ్మాయిని పొగిడినా కలిసినా నెత్తింట ఆ వార్త వైరల్ అవుతుంది. అలాగే ఇంతకు ముందు ఇన్ స్టాగ్రామ్ లో ఓ అమ్మాయి శారీలో అందంగా ఉందని.. ఆ అమ్మాయి అడ్రస్ ఎక్కడ అని ఓ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తను ఫుల్ పాపులర్ అయింది. దాంతో తను ఆర్జీవీని కలిసింది. ఆవిడే శ్రీలక్ష్మీ సతీష్.
శ్రీలక్ష్మీ సతీష్ కాస్త ఆరాధ్యదేవిగా మారిన సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో చీరకట్టుతో రీల్ వీడియోలు చేసుకుంటూ ఉంటే శ్రీలక్ష్మీ సతీష్ వర్మ కంట్లో పడటం.. ఆమె శారీ అనే మూవీని తీస్తానని అప్పుడే ప్రకటించడం అందరికి తెలిసిందే. వర్మ ఈ బ్యూటీ మీద కన్నేసిన తరువాత ఆమె ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగింది. లక్షల్లో ఫాలోవర్లు వచ్చి పడ్డారు. తాజాగా తను నెటిజన్లతో మాట్లాడింది. అందులో ఓ నెటిజన్.. నీ ఏజ్ ఎంత అని అడిగాడు. 22 అని చెబితే చాలా మంది నమ్మలేదు. హైట్ ఎంత అని అడిగితే.. 5 ఫీట్లు 8 అంగుళాలు అని చెప్పింది. ఇక నీ షేపులు, కర్వ్స్ అంటే చాలా ఇష్టం, అదే నీలోని అందం అంటూ చాలా మంది పొగిడేశారు. అయితే ఆ షేపులు, కర్వ్స్ అంత ఈజీగా రాలేదని, ఎన్నో త్యాగాలు చేశాను.. ఎంతో వర్కౌట్ చేశాను.. ఎంతో కష్టపడితే వచ్చిందని ఆరాధ్య చెప్పుకొచ్చింది.
ఆరాధ్య దేవీ ఇండస్ట్రీకి రావటానికి చాలా సమస్యలు ఎదుర్కుందని చెప్పింది. ఒకప్పుడు తన మీద కూడా బాడీ షేమింగ్, ట్రోలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ పొట్టి బట్టల్లో కనిపించే దాని కన్నా.. నిండుగా చీరకట్టులో కనిపిస్తేనే అందంగా ఉంటావ్ అని ఓ నెటిజన్ అంటే.. తనకు శ్రీదేవీ అంటే చాలా ఇష్టమని, ఆవిడ ఎలాంటి దుస్తుల్లోనైనా అందరినీ ఆకట్టుకునేది.. నేను కూడా అలానే ఓ నటిగా అన్ని రకాల దుస్తుల్లో అందరినీ మెప్పించేందుకు ప్రయత్నించాను అని ఆరాధ్య చెప్పుకొచ్చింది. ఆర్జీవీ కంట్లో పడితే ఈ బ్యూటీ అయిన హిట్ లిస్ట్ లో ఉండాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు ఆర్జీవీ ఖాతాలో మరో పాప అని కామెంట్లు చేస్తున్నారు.