బెంగళూర్ రేవ్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్న అంశం. ఈ పార్టీ వేడి ఇంకా చాలలేదు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది..కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా కరాటే కళ్యాణి ఒక ఇంటర్వ్యూలో ఒక బాంబు పేల్చింది. “హేమ మా అసోసియేషన్‌లో మెంబర్. నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న టైములో “మా” వాట్సాప్ గ్రూప్‌లో జబర్ధస్త్ అమ్మాయి ఫోటోను హేమ పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఎందుకు పెట్టారు అని అందరు అడిగేసరికి హేమ వెంటనే వర్ష ఫోటోను డిలీట్ చేసింది. ఎవరికో ఫోటో పంపబోయి గ్రూప్‌లో వచ్చిందని తర్వాత చెప్పింది. ఈ వాట్సాప్ గ్రూప్ మా వార్ రూమ్ లాంటిది.
అక్కడ మా పర్సనల్ విషయాలు అవి మాట్లాడుకుంటాం. అసలు గ్రూపుల్లో అమ్మాయిల ఫోటోలు ఎందుకొస్తున్నాయి అనే విషయం మాకు అర్ధం కాలేదు. హేమ ఇలా తప్పుల మీద తప్పులు చేసి దొరికిపోతూనే ఉంది. తాజాగా హేమ బ్లడ్ శాంపుల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. బ్లడ్ శాంపిల్ ని ఎవరూ మార్చలేరు కదా. ఆమె ఈ కేసు నుంచి బయట పడాలని కొరుకుంటున్నాను. కానీ బెంగళూరు రైల్వే పార్టీకి వెళ్లానని చెప్పకుండా హేమ తన ఇంట్లో ఉన్నట్టు నిరూపించుకోవడానికి ఏవేవో చేసి చివరికి అడ్డంగా బుక్ అయ్యింది. ఇంట్లో బిర్యానీ చేస్తున్నట్టు, మామిడి కాయ పచ్చడి పడుతున్నట్టు అసలేమీ తెలియనట్టు వీడియోల మీద వీడియోలు పోస్ట్ చేసింది..ఇదో పెద్ద కేసు…దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని చెప్పింది. ఐతే నెటిజన్స్ మాత్రం “అనవసరంగా ఎందుకు వర్ష పేరు తెస్తున్నారు. వర్ష మీ మీద పరువు నష్టం దావా వేయొచ్చు” అని కామెంట్స్ చేస్తున్నారు.