అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ సినిమా ఎంతో ప్రత్యేకం. అంతేకాదు, అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమాని ఎవర్గ్రీన్ మూవీగా భావిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, అక్కినేని నాగేశ్వరరావు, అఖిల్.. ఇలా ఫ్యామిలీలోని వారంతా కలిసి నటించిన ఈ సినిమాని అపురూపంగా భావిస్తున్నారు అభిమానులు. ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్ళ సందర్భంగా ఇటీవల రిరిలీజ్ చేశారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్లో ఈ సినిమా ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాను మరోసారి వీక్షించేందుకు అక్కినేని ఫ్యామిలీతోపాటు అభిమానులు కూడా వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, నాగచైతన్య, సుప్రియ.
ఆల్రెడీ చూసిన సినిమానే అయినా మూవీని మళ్లీ చూస్తూ అందరూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సుప్రియ తాతని స్క్రీన్‌పై చూసి పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే నాగచైతన్య, సమంత రొమాంటిక్ సీన్స్‌కి థియేటర్లో అద్భుతమైన స్పందన వచ్చింది. అభిమానులు ఆ సీన్స్ వచ్చినపుడు రెచ్చిపోయారు. విజిల్స్ వేస్తూ, పేపర్స్ జల్లుతూ హడావిడి చేశారు. ఇది నాగచైతన్య అసహనం వ్యక్తం చేస్తూ సీరియస్ అయ్యారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.