సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కావాలంటే.. ఆర్జీవీ దృష్టిలో పడితే చాలు. రాత్రికి రాత్రే వారు సెలబ్రిటీలుగా మారతారు. అప్పటి వరకు వారి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఒక్కసారి ఆర్జీవీ వారి గురించి ట్వీట్ చేశాడంటే.. ఇక వారి దశ తిరిగి.. రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ అందుకుంటారు. అశురెడ్డి, అరియానా వీరంతా ఆర్జీవీ వల్లనే నేను, ఫేము సంపాదించుకున్నారు. ఈ కొన్ని రోజుల క్రితం ఆర్జీవీ.. ఓ అందమైన అమ్మాయి ఫోటో షేర్ చేసి తన వివరాలు కావాలి.. ఎవరికైనా తెలిస్తే.. తనకు మెసేజ్ చేయండి అని పోస్ట్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో సదరు యువతి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. తనే శ్రీలక్ష్మీ సతీష్ అలియాస్ ఆరాధ్య దేవి.
ఇన్‌స్టాగ్రామ్‌లో చీర కట్టుతో రీల్స్ చేస్తూ.. వీడియోలు పోస్ట్ చేసుకుంటూ ఉండే శ్రీలక్ష్మీ సతీష్.. అనుకోకుండా వర్మ కంట్లో పడింది. ఆమె అందం ఆర్జీవీని ఆకర్షించింది. దాంతో ఆ బ్యూటీ వివరాలు కావాలని కోరడమే కాక.. ఆమె ప్రధాన పాత్రలో శారీ అనే సినిమాను కూడా ప్రకటించింది. దాంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. రాత్రికి రాత్రే లక్షల్లో ఫాలోవర్లు చేరారు. ఓవర్‌నైట్‌లో స్టార్‌డం సంపాదించుకుంది. ఇక ఆర్జీవీ ప్రకటించిన శారీ సినిమా కోసం ఈ బ్యూటీ పేరును ఆరాధ్య దేవిగా మార్చినట్లు తెలుస్తోంది.
ఇక ఆరాధ్య దేవి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఫాలోవర్లు, నెటిజనులు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. ఎక్కువగా ఆమె కళ్లు, నడుము, వయసు, షేపులు, ఆ ఒంపుసొంపుల గురించి అడుగుతుంటారు. అందరూ వాటిని గురించే ప్రశ్నిస్తారు.. ప్రశంసిస్తారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ కోరిక నెటిజనులు మీ వయసు ఎంత అని ప్రశ్నించారు. అందుకు ఆమె 22 అని చెప్పింది. అలానే మరో యుజర్.. మీ నీ షేపులు, కర్వ్స్ అంటే చాలా ఇష్టం.. అందంగా ఉంటాయి అని కామెంట్ చేశాడు. అందుకు ఆరాధ్య థాంక్స్’ చెప్పి.. తన బాడీ ఇలా మారడానికి తాను ఎన్నో త్యాగాలు చేశానని.. ఎన్నో కష్టమైన వర్కౌట్లు చేశానని.. ఎంతో కష్టపడితే.. తన బాడీ ఈ షేపుకు వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న బాడీమింగ్ గురించి చెప్పుకొచ్చింది ఆరాధ్య. చాలా మంది తనను విమర్శించారని.. బాడీ షేమింగ్ అని ఎమోషనల్ అయ్యింది. ఇంకా శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెలానే.. ఎలాటి దుస్తుల్లో అయినా.. ఆకట్టుకునేలా తన శరీరాన్ని మార్చుకున్నాను.. మరో నటిగా.. అన్ని రకాల దుస్తుల్లో అందరనీ మెప్పించేందుకు ప్రయత్నించాను అని చెప్పుకొచ్చింది ఆరాధ్య దేవి.