గత వారం హైదరాబాద్‌లో ఆహార భద్రత అధికారుల దాడుల సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వాటిల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పలు హోటల్లో ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం బయట ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. పలు హోటల్ యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ దాడులతో ఆహారం ప్రియుల గుండెల్లో దడ మొదలైంది. ఇదే సమయంలో చాలా మంది ఈ దాడులు జరుగుతున్నాయి. తాజాగా సినీ నటుడు బ్రహ్మజీ ఫన్నీగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మారుతున్న జీవనశైలి కారణంగా బయట పుడ్ తినే వారి సంఖ్య బాగా పెరిగింది. వండుకునే ఓపికలేక కొందరు, రెస్టారెంట్ ఫుడ్ తినాలనే కోరికతో మరికొందరు బయటి ఆహారం తీసుకుంటున్నారు. ఇంట్లో.. ఎంతో శుభ్రంగా.. రుచిగా చేసినా సరే.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారు పెరిగిపోయారు. పైగా కొన్ని రెస్టారెంట్లు టైం తో సంబంధం లేకుండా 24 గంటలు ఫుడ్ డెలివరీ చేస్త.. ఇక బయట ఫుడ్ తినే వారు బాగా పెరిగిపోయారు. మరో రెస్టారెంట్, పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్లి భోజనం చేసే వారికి.. ఇటీవల షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ కోరికనే హోటళ్ల డొల్లతనం బట్టబయలు అవుతోంది.
ఈ ఇష్యూపై పెద్ద సంఖ్యలో నేటినజ్లు కనిపిస్తున్నాయి. అలానే కొందరు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సినీ నటుడు బ్రహ్మాజీ సైతం ఓ ఫన్నీ ట్వీట్ చేశారు. అధికారుల దాడులపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ట్వీట్ చేశారు. ఫుడ్ సెఫ్టీ కమిషనర్ చేసిన ట్వీట్‌ను ఉద్దేశించి ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు. ఇలా అయితే మరీ ఎక్కడ తినాలి సార్? ఇంట్లోనేనా? అని రిప్లై ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో హోటల్ యజమాన్యాల నిర్లక్ష్యానికి ఫుడ్ లవర్స్ భయపడుతున్నారు. ఇక నుంచి బయట తినాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని చాలా పోస్టులు పెడుతున్నారు. మరి..సినీ నటుడు బహ్మాజీ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
సార్.. మరి ఎక్కడ తింటమంటారు..?
ఇంటిలోనా..? https://t.co/Vs8r0kd83A– బ్రహ్మాజీ (@actorbrahmaji) మే 23, 2024