ఈ మధ్య ఓటీల హవా పెరిగిన సంగతి అందరికి తెలిసిందే. అందుకే థియేటర్ ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం ఓటీలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. అందుకే సినిమాల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు కూడా ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అదే విధంగా లక్షలతో తెరకెక్కిన సినిమాలు కోట్లలో వసూళ్లు రాబడుతున్నాయి. థియేటర్ లో ప్లాప్ అయ్యి.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమా ‘మేడమ్ వెబ్ సినిమా’
మేడమ్ వెబ్ సినిమా కొలంబియా పిక్చర్స్, మార్వెల్ ఎంటర్‌టైన్, ఇతర నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించబడ్డాయి. లారెంజో డీ బోనావెంచురా నిర్మాతగా వ్యవహరించారు.ఈ చిత్రంలో డకోటా జాన్సన్, సిడ్నీ స్వీనీ, ఇసబెల్లా మెర్సెడ్, సెలెస్టే ఒకానర్, ఇమ్మా రాబర్ట్స్, ఆడమ్ స్కాట్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. మేడమ్ వెబ్ మూవీని ఎస్‌జే క్లార్కన్స్ తెరకెక్కించారు. 2024 ఫిబ్రవరి 16న మేడమ్ వెబ్ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. దాదాపు 80 నుంచి 100 మిలియన్ డాలర్లు, అలానే ఇతర ఖర్చులతో చూసుకుంటే ఈ సినిమా దాదాపు 115 మిలియన్ డాలర్ల బాజ్జెట్‌తో తెరకెక్కింది.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా అతి తక్కువ వసూళ్లు అయ్యాయి. మొత్తంగా ఈ మూవీ 10.03 కోట్ల యూఎస్ డాలర్స్ మాత్రమే రాబట్టగలిగింది.ఇక మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లు అయితే దాదాపు రూ.950 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 600 కోట్లు మాత్రమే వసూలు చేసిందని చెప్పొచ్చు. సోనీ స్పైడర్ యూనివర్స్‌లో మోర్బియస్ మూవీ దారుణమైన మూవీగా అభివర్ణించారు. దానికంటే ఘోరమైన సినిమాగా మేడమ్ వెబ్ అంటూ పలు రివ్యూలు వచ్చాయి.
ఇలా ప్లాప్ అయిన మేడమ్ వెబ్ సినిమాకు ఓటీటీలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా అదరగొడుతోంది. మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ 2 ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. ఓటీటీలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా టాప్ 2లోనే ఉంటుంది. అదే విధంగా మేడమ్ వెబ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అమెజాన్ లో మాత్రం రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఎవరైనా చూడకుండా ఉంటే.. చూసేయండి.