సింగర్ చిన్మయి అంటే ఫైర్ బ్రాండ్. ఒకప్పుడు మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ కోలీవుడ్‌ను షేక్ చేసింది చిన్మయి. వైరముత్తు, సింగర్ కార్తిక్ వంటి వారు చేసిన పనులను బయట పెట్టారు. అలాగే వీళ్ళను “మోలెస్టర్స్” అనే పేరు పెట్టి మరీ ఫైట్ చేస్తూ ఉంటుంది. మహిళలపై అత్యాచారాలు చేసే ఇలాంటి మోలెస్టర్స్ కి అవకాశాలు ఇచ్చే వాళ్ళ మీద కూడా విరుచుకు పడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నిటి కారణంగా ఆమె మీద కోలీవుడ్ లో బ్యాన్ కొనసాగుతోంది. అందుకే ఆమెకు అక్కడ సాంగ్స్ పాడే అవకాశం లేకుండా పోయింది. ఎవరెంత చెప్పినా ఆమె తన దారిని ఇంతవరకు మార్చుకోలేదు. అలాగే రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మీద కూడా విరుచుకు పడి ఒక వీడియోని కూడా షేర్ చేసింది.
అలాంటి చిన్మయి రీసెంట్ గా కోలీవుడ్ మ్యూజిక్ ఫ్యామిలీ మీద కౌంటర్లు పేల్చింది. “మీ టూ ఉద్యమం కారణంగా ఎవరు ఎలాంటి వారు ఎలా ప్రవర్తిస్తారో అన్న విషయం బాగా తెలిసింది. అందుకే అలాంటి మోలెస్టర్స్ కి వాళ్లకు అవకాశం ఇస్తున్న వాళ్ల నుంచి నా పిల్లలను దూరంగా ఉంచాలనుకుంటున్నాను. కనీసం 5 దూరం ఉంచుతాను.” అంటూ సెటైర్స్ వేసింది.
ఇక నెటిజన్స్ ఐతే చిన్మయి మీద కౌంటర్లు వేసేవాళ్ళు వేస్తున్నారు…పొగిడేవాళ్లు పొగుడుతున్నారు. ‘భారత దేశంలో పుట్టడం నా కర్మ’ అంటూ గతంలో ఘాటుగా మాట్లాడడం ఆమెకే చెల్లింది. సింగర్ చిన్మయి మీద చాలా మంది కేసులు కూడా పెడుతూ ఉంటారు. ఓవర్ యాక్షన్ అంటూ కామెంట్స్ చేస్తారు. కానీ ఆమె అస్సలు వాటిని పట్టించుకోకుండా తన పని తానూ చేసుకు పోతూ ఉంటుంది.