ఇటీవల సెలబ్రిటీల కేసులకు సంబంధించిన వార్తల్లో ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో రేవ్ పార్టీ ఘటనలో సినీ హేమ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ తరువాత అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. అలానే ఆషిరాయ్ అనే నటి కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో హీరోపై కేసు నమోదైంది. టాలీవుడ్ హీరో తొట్టెంపూడి వేణుపై పోలీస్ కేసు నమోదైంది. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం
సినీ నటుడు తొట్టెంపూడి వేణుకు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం, చెప్పవే చిరుగాలి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఇటీవల కాలంలో సహ నటుడిగా యాక్ట్ చేస్తున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇది ఇలా ఉంటే… తాజాగా ఆయనపై కేసు నమోదు కావడంతో వార్తల్లో నిలిచాడు. ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు, మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతోపాటు సంస్థ ఎండి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరాఖండ్ రాష్ట్రములో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ కాంట్రాక్ట్ ను తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీ) ద్వారా ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ దక్కించుకొంది. ఈ వర్క్ ను బంజారాహిల్స్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ అనే రెండు సంస్థలకు ఈ ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ అందించారు. ఈ పనులకు సంబంధించి రెండు సంస్థల్లో ఒకటైన స్వాతి కన్‌స్ట్రక్షన్ మధ్యలోనే తప్పు చేస్తోంది. రెండో సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్ 2002లో పనులు ప్రారంభమయ్యాయి.
ఇక వారు చేసిన పనులకు రూ. 450 కోట్లను టీహెచ్‌డీసీ విడుదల చేసింది. అందులో 5.5 శాతం ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ తీసుకొని, మిగిలిన 94.5 శాతం రిత్విక్ కన్‌స్రక్షన్స్ అకౌట్‌లో వేశారు. ఆ తరువాత ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కి, తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు మధ్య ఓ విషయంలో వివాదం ఏర్పడింది. దీంతో వీరి పంచాయితీ ఢిల్లీ హైకోర్టు వరకు చేరింది. తాజాగా ఈ పనులకు రూ.1,010 కోట్లు విడుదలయ్యాయి. ఆ డబ్బును తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్ అకౌట్‌లో జమ చేసింది. ఈ డబ్బుల్లో సైతం ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఒప్పంద హక్కులను రద్దు చేసింది.
రిత్విక్ ప్రాజెక్ట్స్‌తో చేసుకున్న ఒప్పంద హక్కులను ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి, కావూరి భాస్కర్‌రావు, మరో ప్రతినిధి, హీరో తొట్టంపూడి వేణు, పీసీఎల్ సంస్థ డైరక్టర్ కె.హేమలత, భాస్కర్ రావు సోదరి శ్రీవాణిలతో పాటు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ పాతూరిలను రద్దు చేశారు. దీనితో వారు ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బు కోసం ప్రయత్నిస్తున్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్‌లు వారు కేసు నమోదు చేశారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి.రవికృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మొత్తం 5 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.