స్టార్ హీరోయిన్ ‘కాజల్ అగర్వాల్’..ఈ మధ్యకాలంలో పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న విషయం తెలిసిందే. అతి తక్కవ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ముఖ్యంగా ఈ టాలీవుడ్ చందమామ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఈ ఇష్టంనే.. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోల అందరీ సరసన నటించి క్రేజీ హీరోయిన్గా తనదైన ముద్ర వేసుకుంది కాజల్ ఆగర్వఆల్. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త హీరోయిన్లు కాజల్ అందం, అద్భుతమైన నటన ముందు దిగదుడుపు అనే చెప్పవచ్చు.
ఇకపోతే కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న కాజల్.. ఆ తర్వాత ఓ మగ బిడ్డకు జన్మనివ్వడంతో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కాగా, ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ వంటినే వరుస లేడి ఓరియెంటడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది కాజల్. తాజాగా ఈమె డైరెక్టర్ శశి కిరణ్ తిక్కనిర్మించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’లో నటించింది. కాగా,ఈ సినిమా జూన్ 7వ తేదీన థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. కాగా, ఇందులో కాజల్ పవర్ఫుల్ పోలీసు పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది కాజల్. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ ఒక తెలుగు సినిమా తనను తెగ ఏడిపించిందంటూ చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ.. ‘ఓరోజు సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉండటంతో బోర్ కొట్టి అలా నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేశాను. అప్పుడే నాకు అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమా కనిపిస్తే చూడటం మొదలుపెట్టాను. ఇక ఆ సినిమా చూస్తూ నాకు తెలియకుండానే ఏడుపొచ్చేసింది. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. అలా చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాను.
ఇక వెంటనే పారిస్‌లో ఉన్న నా భర్తకి కాల్ చేసి మాట్లాడాను. అప్పుడే నేను మేజర్ డైరక్టర్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నాను. అంతలా ఆ సినిమా అందరి పెర్ఫామెన్స్ నాకు బాగా నచ్చింది. నిజానికి 26/11 దాడికి నా లైఫ్‌కి ఓ రిలేషన్ ఉంది. ఎందుకంటే.. మా ఇల్లు ఆ దాడి జరిగిన తాజ్ హోటల్ దగ్గరే ఉండేది. అందుకే అనుకుంటే దానికి ఎక్కువగా కనెక్ట్ అయ్యాను’. అంటూ కాజల్ చెప్పింది. ఇక భగవంత్ కేసరి షూటింగ్లో భాగంగా హైదరాబాద్‌లో ఉండగా ‘సత్యభామ’ కథ చెప్పడానికి శశి తన టీమ్‌తో వచ్చినట్లు కాజల్ చెప్పింది. కాగా, ‘ఆ రోజు నేను ఆ రోజు చాలా అలసిపోయాను. అందుకే కథ చెప్పడానికి వారికి ఒక గంట సమయమే ఇచ్చాను. కానీ, స్టోరీ మొదలుపెట్టిన తర్వాత అలా మూడు గంటలు గడిచిపోయాయి. అలా తెలీకుండానే ఆ స్టోరీలో లీనమైపోయాను. వెంటనే వారికి ఓకే చెప్పేశాను’ అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.
కాగా, సత్యభామ సినిమాను అఖిల్ డేగల డైరెక్ట్ చేశారు. శశి కిరణ్ తిక్క కథా రచయితగా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ అదరగొట్టేసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల్లో అల్లాడించింది. ఇంతకు ఎప్పుడూ ఇలాంటి కాజల్ చేయబోయే చిత్రం గురించి తన ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్గా రూపొందించారు. మరి, కాజల్ మేజర్ సినిమా పై చెప్పుకొచ్చిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.