కొంత మంది హీరోయిన్లు నేరుగా తెలుగు సినిమాలో నటించనప్పటికీ.. డబ్బింగ్ మూవీలతో ఆకట్టుకుంటారు. ఆ ఇంట్రస్టే ఆ నటిమణులను తెలుగులో యాక్ట్ చేసేలా చేస్తుంది. ముఖ్యంగా కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న తారామణులు టీ టౌన్‌లో ఒక్క అవకాశం రాదా.. తమను తాము ప్రూవ్ చేసుకోలేకపోతామా అని భావిస్తున్నారు. కానీ ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు చెలరేగిపోతుంటారు. ఆ కోవలోకే వస్తుంది ఈ లడ్డూ పాప. చైల్డ్ ఆర్టిస్టు నుండి అలరించిన ఈ బ్యూటీ.. పెళ్లైన తర్వాత కూడా సత్తా చాటుతుంది. హీరోయిన్‌గా పీక్స్ టైంలోనే ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటుంది. నటనకు పెళ్లితో సంబంధం లేదు అని నిరూపిస్తుంది ఈ క్యూట్ లిటిల్ వన్. పద్ధతిగా ఉండే పాత్రల్లో మెప్పిస్తూ ఉంటుంది.
బూరె బుగ్గలు వేసుకుని కెమెరాను తదేకంగా చూస్తున్న ఈ అమ్మాయి ఒక్కటంటే ఒక్కటే తెలుగు సినిమా చేసింది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె ఓ డబ్బింగ్ సినిమా ద్వారా సుపరిచితం. చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది.. నటిగానే కాకుండా నిర్మాతగా రాణిస్తుంది. భర్తతో కలిసి సినిమాలు తీస్తోంది. ఆ బ్యూటీ ఎవరంటే.. నజ్రియా నజీమ్. మాలీవుడ్ స్టార్ హీరో పహాద్ ఫజిల్ (పుష్ప విలన్)భార్యనే ఈ నజ్రియా. రాజా రాణి మూవీతో సుపరిచితమైన ఈ నటి.. ఆ మూవీ వచ్చిన దాదాపు పదేళ్లకు తెలుగు వారిని పలకరించింది. 2006లో బాల నటిగా కెరీర్ స్టార్ చేసింది. మాడ్ డాడ్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బైలింగ్వల్ మూవీ నేరం మూవీలో యాక్ట్ చేసింది.
2013లో వచ్చిన రాజా రాణితో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో డబ్ అయ్యి.. ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. అదే సమయంలో నజ్రియాకు కూడా పేరు వచ్చింది. ఆ తర్వాత ఓం శాంతి హోసన్నా, వాయి మూడీ పేసవం, బెంగళూరు డేస్ చిత్రాల్లో నటించింది. బెంగళూరు డేస్ మూవీలో తనకు భర్తగా నటించిన పహాద్‌ను రియల్ లైఫ్‌లో మనువాడింది. ఆ తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉంది అమ్మడు. 2018లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కోడై, ట్రాన్స్ చిత్రాల్లో నటించింది. తెలుగులో నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక నిర్మాతగా మారి ఫుల్ సక్సెస్ సినిమా తెరకెక్కిస్తుంది. కుంబళంగి నైట్స్, సీ యూ సూన్, ఆవేశం వంటి సినిమాలు నిర్మించింది ఈ బ్యూటీ. అటు నటిగా, ఇటు నిర్మాతగా మలయాళం ఇండస్ట్రీలో రాణిస్తుంది.