దేశంలో ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు ఈ తిప్పలు తప్పడం లేదు. కొన్నిసార్లు సినీ తారలు బయట ప్రదేశాలకు వెళ్లినపుడు అభిమానులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆ సమయంలో నటిమణులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం అంటూ మీడియా వేదికగా తమ భాద వెల్లబుచ్చుతారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్ కి వెళ్లిన నటి కాజల్ నడుపై అభిమాని చేయివేయబోయాడు.. వెంటనే అలర్ట్ అయి పక్కకు జిగింది. ఇలాంటి ఘటనలు సినీ నటులకు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఓ వ్యక్తి బస్సులో తనను అసభ్యంగా తాకాడని నటి అంజలి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
విజయ్ టీవిలో ఓ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన అంజలి భాస్కర్ తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం ఆమెకు వెండితెరపై ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..’సమాజంలో ఎంతో మంది అమ్మాయిలు ఏదో ఒక రకంగా వేధింపబడుతూనే ఉన్నారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. తొలినాళ్లలో ఫ్రెండ్స్ బట్టలు వేసుకొని షూటింగ్ కి వెళ్లేదాన్ని.. క్యాబ్ కి డబ్బుల్లేక బస్సుల్లో వెళ్లేదాన్ని.. ఓ రోజు బస్సులో నడిచే వ్యక్తి నా భుజంపై చేయి వేశాడు. మెల్లిగా తడమడం మొదలు పెట్టాడు. తండ్రి వయసు ఉన్న అతను చేస్తున్న పని నాకు అసభ్యంగా అనిపించింది. కోపంతో అతన్ని కొట్టాను, తిట్టాను. వెంటనే సిగ్గుతో దిగి వెళ్లిపోయాడు’ అని బస్సు.
నాకు జరిగిన ఆ అవమానం గురించి మహిళలతో ఎవరూ స్పందించలేదు. ఆ సమయంలో ఇంకా ఏం జరిగినా ఇదే రెస్పాన్స్ ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి దారుణమైన అనుభవాలు బస్సు ప్రయాణాలు చేసే మహిళలకు తరుచూ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు ఎదిరించి బుద్ది చెబుతారు.. సరైన కొందరు మాత్రం మౌనంగా ఆ బాధను భరిస్తారు. ప్రస్తుతం నేను నటిస్తున్న సీరియల్ కి మంచి స్పందన వస్తుంది. ఇండస్ట్రీలో నాతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను ఎవరితో అతిగా మాట్లాడను.. సార్ధుకుపోయే గుణం నాకు ఉంది. కష్టపడి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం అని.