బిగ్ బాస్ తెలుగు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించి బజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అవుతుందా అని అంతా అనుకున్నారు. అలాంటి వారికి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే అందుతుంది. ఇప్పటివరకు కంటెస్టెంట్స్ గురించే టాక్ నడుస్తోంది. ఎవరెవరు వెళ్లబోతున్నారు? ఎవరు ఈసారి సీజన్ లో ఉంటారు అనే విషయాలకు సంబంధించి ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ. ఇప్పటికే ఒక లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. కానీ, ఆ జాబితాలో ఒక పేరు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఒకసారి అడుగుపెట్టి పెట్టగానే వచ్చేసింది. ఈసారి వచ్చేది కప్పుతోనే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వైరల్ అవుతోంది. నిజానికి ఇది అధికారికం కాదు. రివ్యూవర్ ఆదిరెడ్డి లాగా ఎవరో ఈ పేర్లు చెప్తూ ఉంటారు. వారికి తెలిసిన వారినో.. తెలుసుకోవాలి అనుకున్న వారినో వాకబు చేసి కొన్ని షూర్ షాట్ పేర్లు చెప్పారు. అలా ఆదిరెడ్డి ఒక పెద్ద లిస్టే క్రియేట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా చేశాడు. అయితే ఆ లిస్టులో ఒక పేరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె కచ్చితంగా ఈ సీజన్‌లోకి రావాలి అంటూ కోరుకుంటున్నారు. రావడం మాత్రమే కాదు.. ఆమె కప్పు కొట్టుకుని వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆ లిస్ట్ లో పేరు మరెవరిదో కాదు.. నయని పావని. అవును ఈసారి సీజన్‌లోకి నయనీ పావని వెళ్తుంది అని గట్టిగానే టాక్ స్టార్ట్ అయ్యింది. ఆదిరెడ్డి కూడా ఆమె వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా చెబుతున్నాడు. అదేంటి.. గతం సీజన్లో వచ్చింది కదా.. మళ్లీ ఎలా వస్తుంది? అని డౌటనుమానాలు వద్దు. ఈసారి పాత వాళ్లు కూడా ఈ సీజన్‌లో కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ లిస్ట్ లో నయని పావని పేరు గట్టిగా వినిపిస్తోంది. పైగా గత సీజన్‌లో ఒక వారానికే పావనిని ఇంటికి పంపారు. ఆ తర్వాత వాళ్లు చేసింది తప్పు అనే విషయం అర్థమైంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. నయని పావనీకి అన్యాయం జరిగింది అంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. పైగా ఆ అమ్మాయి హౌస్ లో అబ్బాయిలతో పోటీ పడి ఆడింది. కానీ, ఒక వారానికి రావడంతో అంతా షాకయ్యారు.
ఈసారి హౌస్ లోకి తప్పకుండా పంపిస్తారు అంటున్నారు. నయనీ పావనీ టాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరూ చూశారు. ఆమె చక్కగా ఆడుతుంది.. మాట్లాడుతుంది.. పోరాడుతుంది.. డ్యాన్స్ చేస్తుంది.. పాడుతుంది కూడా. పైగా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. అందుకే నయనీ పావనీకి ఈసారి మెండుగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా ఆమె గనుక హౌస్ లోకి ఎంటర్ అయితే కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ గానే వెళ్తుంది. టైటిల్ కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. నయనీ పావనీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి వెళ్తే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.