విశాల్ పట్ని.. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఎదుగుతున్న నటుడు. ఇప్పటికే తమిళ్‌లో సినిమా తుపాకి, తెలుగులో మా అబ్బాయి, రాజధాని ఫైల్స్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు సూర్యపుత్ర కర్ణ్, మహా రాణా ప్రతాప్, మహారక్షక్ ఆర్య వంటి టీవీ సిరీస్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు విశాల్. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి అందరి దృష్టినీ ఆకర్షించారు విశాల్. తన నటనతో అందర్నీ విశేషంగా ఆకట్టుకున్న విశాల్‌కు తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమాల ఇండస్ట్రీలు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే టాలీవుడ్‌లో ఒకదానిని మించి మరో సినిమా అన్నట్టుగా ఇండియన్ సినిమా రేంజ్‌ని పెంచే దిశగా భారీ సినిమాలు రూపొందుతున్నాయి. తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్పడడంతో బాలీవుడ్ స్టార్స్ సైతం తెలుగు సినిమాపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. తెలుగులో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో నటుడు విశాల్ పట్ని తెలుగు సినిమాలపై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. తెలుగులో ఎంతో వైవిధ్యం ఉన్న సినిమాలను రూపొందిస్తున్నారని అంటున్నారు విశాల్. ‘రాజధాని ఫైల్స్’ చిత్రంలో తను చేసిన పాత్రకి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చిందని, అలాంటి మంచి క్యారెక్టర్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలన్నదే తన లక్ష్యం అంటున్నారు విశాల్ పట్ని.