డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని అంటారు. డాక్టర్ గా చేసిన వాళ్ళు హీరోలుగా, హీరోయిన్స్ గా చేసిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ రాజశేఖర్, సాయిపల్లవి లాంటి వాళ్ళు డాక్టర్ గా చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చాక ఒక పక్క నటిస్తూనే మరోపక్క డాక్టర్ గా సేవలు అందించడం చాలా అరుదు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రవాహంలో పడి ట్రెండ్ ట్రెండ్ అని వెంపర్లాడే పరిస్థితి. సినిమాలు చేశామా? ట్రిప్ కి వెళ్ళామా? నాలుగు ఫోటోలు క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో షేర్ చేశామా? ఏమైనా ప్రమోషన్ వస్తే చేసుకున్నామా? షాపింగ్ మాల్ ఓపెనింగ్ వస్తే చేశామా? అన్నట్టు ఉంటున్నారు. ఇంత బిజీ లైఫ్ లో సోషల్ సర్వీస్ చేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మన తెలుగు హీరోయిన్ కూడా ఉన్నారు.
ఆమె డాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆమె మరెవరో కాదు అచ్చ తెలుగమ్మాయి రూప కొడువాయూర్. ఈమె సత్యదేవ్ నటించిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఈమె ఒక డాక్టర్, డ్యాన్సర్ కూడా. వృత్తిరీత్యా డాక్టర్ అయిన రూప.. సినిమాలు చేస్తూ కూడా డాక్టర్ గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. డాక్టర్ గా పలు సేవా కార్యక్రమాలు చేశారు. తాజాగా ఓ విలేజ్ కి వెళ్లి అక్కడ మానసిక వైకల్యం ఉన్న బాలికలకు, అలానే వారి తల్లిదండ్రులకు పీరియడ్స్ పై అవగాహన కల్పించారు. అదనంగా ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించారు. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
హ్యాపీ పీరియడ్స్.. పీరియడ్స్ గురించి ఫ్రీగా మాట్లాడే ప్రపంచాన్ని క్రియేట్ చేయడం.. చదువు ద్వారా పీరియడ్స్ పై అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. పీరియడ్స్ సమయంలో ఒక అమ్మాయి ఆరోగ్యం.. ఆమె ఫిజికల్ హెల్త్, మానసిక ఆరోగ్యం విషయంలో కీలక రోల్ ప్లే చేస్తుందని అన్నారు. పీరియడ్స్ పై వచ్చే అపోహల గురించి, అసాధారణమైన పీరియడ్స్, ఆరోగ్యకరమైన పీరియడ్స్ మధ్య తేడా తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు. తాను ప్రతి ఏటా ఈ ఏడాది కూడా మానసిక వికాస్ ఎన్జీఓని సందర్శించానని.. ఈ ఏడాది ఇక్కడ పిల్లలకు, వారి పేరెంట్స్ కి పీరియడ్స్ గురించి అవగాహన కల్పించానని అన్నారు. పీరియడ్స్ సమయంలో శుభ్రత, ఆరోగ్యం గురించి.. అలానే డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి వంటి విషయాల్లో అవగాహన కల్పించేందుకు ఒక అడుగు ముందుకు వేశానని అన్నారు.
పీరియడ్స్ టైంలో వారు ఎదుర్కునే సమస్యల గురించి.. వారికి కావాల్సిన అవసరాల కోసం ఒక డాక్టర్ గా వారికి చెప్పడం ఛాలెంజింగ్ గా అనిపించిందని అన్నారు. తాను ఈ పీరియడ్స్ కి సంబంధించిన దాంట్లో పని చేయలేదని.. దీని గురించి పెద్దగా చదువుకోలేదని అన్నారు. ఈ గ్రామంలో అందరూ శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించలేరు.. అందరూ శానిటరీ ప్యాడ్స్ ని కొనుక్కోలేరు. వారికి శానిటరీ ప్యాడ్స్ అందించడం.. వారి ఆరోగ్యాన్ని అందజేయడం.. వారికి పీరియడ్స్ పై అవగాహన కల్పించడం కోసం తనవంతు కృషి చేస్తున్నానన్నారు. ఆమె చేస్తున్న పనికి నెటిజన్లు కొనియాడుతున్నారు. గ్రేట్ డాక్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ప్రియదర్శితో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తున్నారు.