కొన్ని సినిమాలలో కథలు బావుంటాయి.. కానీ స్టార్ క్యాస్టింగ్ ఉండదు. ఇంకొన్ని సినిమాలు స్టార్ క్యాస్టింగ్ ఉంటుంది కానీ కథ ఉండదు. ఇక క్యాస్టింగ్ ను బట్టి ఆయా సినిమాలకు బజ్ నడుస్తుంది. దీనితో కథ బావున్నా సరే కొన్ని సార్లు చిన్న సినిమాలకు ఎటువంటి బజ్ నడవదు. దీనితో ఆ సినిమాలకు అండర్ రేటెడ్ ట్యాగ్ వేస్తున్నారు. కానీ ఒక్కసారి చూస్తేనే ఆ సినిమాలో ఎంత డెప్త్ అనేది అర్ధమౌతుంది. ఓటీటీలో ఎప్పుడు ఏ సినిమాలు వస్తున్నాయి.. వాటిలో ఏది బెస్ట్.. ఏది బావుంది.. ఏ సినిమాకు హైయెస్ట్ రేటింగ్ ఉంది. అని చెప్పి దాదాపు అందరు బెస్ట్ బెస్ట్ అనే వేటలో పడిపోయింది.. కొన్ని మంచి అండర్ రేటెడ్ మూవీస్ ని మిస్ అయిపోతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమానే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ సినిమా కొత్తదా పాతదా అనే విషయాన్నీ పక్కన పెట్టేస్తే.. అసలు కథేంటో తెలుసుకుందాం .. సంతోష్ బాబు బాగా బలం, డబ్బు, పొగరు ఉన్నా ఓ స్టార్ హీరో. అతనికి పాలకొండలో ఓ బలరాం అనే ఓ వీరాభిమాని ఉంటాడు. అతను లారీ క్లీనర్ గా పని చేస్తూ ఉంటాడు. ఓ రోజు అతను అనుకోకుండా ఫ్రెండ్స్ తో గొడవ జరిగినప్పుడు.. ఎలాగైనా ఓ సంవత్సరంలో సంతోష్ తో సినిమా తీస్తానని లేకపోతే చచ్చిపోతానని పందెం కాస్తాడు. దీనితో తన తల్లి గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్తాడు. ఈ అక్కడ తెలంగాణ శకుంతల ఇంట్లో అద్దెకు దిగుతాడు. అక్కడ తన లానే ఎదో సాధిద్దాం అనుకుని వచ్చిన కొంతమందిని కలుస్తాడు. ఈ విధంగా ఆ గ్యాంగ్ లో ఒకరి సహాయంతో.. ఓ రచయితకు అసిస్టెంట్ గా జైన్ అవుతాడు.
అక్కడ కట్ చేస్తే కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉండి.. ఆ తర్వాత కథ రాసేసి.. ఆ కథను సంతోష్ కు వినిపించాలని అతని వెంట పడతాడు. కానీ ఇక్కడ అందరు ఊహించిందే జరుగుతుంది. సంతోష్ అతని కథను వినడానికి ఇష్టపడడు. దీనితో అతను చనిపోవడం అనుకుని సూసైడ్ చేసుకుంటాడు. కానీ ఫ్రెండ్స్ సహాయంతో బ్రతికి బయటపడతాడు. అతను ఆ తర్వాత సంతోష్ తో సినిమా తీశాడా లేదా? .. తీస్తే ఈ అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “ఒక విచిత్రం” అంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా 2006లో విడుదలైంది. దీనిని చూడడానికి ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది. సినిమాలంటే కొంతమందికి పిచ్చి ప్రేమ ఉంటుంది. అలాంటి వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.