భారతదేశాన్ని రక్షించడానికి పరమేశ్వరుడు భారతదేశం నలువైపులా జ్యోతిర్లింగాల రూపంలో స్వయంభూగా కొలువు తీరాడు. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలుచుకుంటాం. అందులో ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ కూడా ఒకటి. మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో ఉంది.ఇక్కడ పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడు గా పూజలందుకుంటున్నాడు. నిత్యం కొన్ని లక్షల మంది స్వామిని దర్శించుకొని ముక్తిని పొందుతారు. సినిమా వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృప తమపై ఉండాలని కోరుకుంటారు. తాజాగా ఇద్దరు హీరోయిన్లు స్వామిని దర్శించుకోవడంతోపాటు ప్రత్యేక పూజలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహాకాళేశ్వర క్షేత్రంలో భస్మ హారతి ఎంతో ప్రత్యేకమైనది. తెల్ల వారు జామున మూడు గంటలకి స్వామికి ఆ హారతిని ఇస్తారు. అందులో పాల్గొనడం చాలా అదృష్టంగా భావించారు.దాంతో సకల జనులు తీరిపోయి మంచి జరుగుతుందని భావించారు. ఇప్పుడు ఆ భస్మ హారతిలో ప్రముఖ హీరోయిన్ లు రాశి ఖన్నా( raashi khanna)వాణి కపూర్ (vaani kapoor)పాల్గొన్నారు. భస్మ హారతి జరుగుతున్నంత సేపు ఇద్దరు శివ పఠనం చేసారు. ప్రత్యేక పూజలు కూడా జరిగాయి. అనంతరం పూజారులు వారికి తీర్ధ ప్రసాదాలు అందించారు.
సుప్రీమ్, ప్రతి రోజు పండుగ, జై లవకుశ, హైపర్, తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, థాంక్ యు, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో నటించి రాశికన్నా మంచి గుర్తింపు పొందింది. తెలుసా కదా అనే మూవీతో త్వరలో తమిళ రాబోతుంది.ఒక సినిమాకి కూడా కమిట్ అయ్యింది. ఇక వాణి కపూర్ కూడా బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో చేసింది. బేఫిక్రి, వార్, బెల్ బాటమ్, షం షీరా, లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.ప్రస్తుతం ఖేల్ ఖేల్ మెయిన్, రెయిడ్ 2 లలో చేస్తుంది. . గతంలో కూడా చాలా మంది తారలు మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు.