తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ ని ఒకప్పుడు హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అప్పట్లో యాక్షన్ తరహా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నటించిన మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరు సీతారామరాజు ఎవర్ గ్రీన్ చిత్రంగా చెబుతారు. తెలుగు ఇండస్ట్రీలో నట వారసులు ఎంతో మంది వచ్చారు.. కానీ కొద్ది మంది మాత్రమే స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ తనయుడు మహేష్ బాబు ఒకరు. తండ్రికి తగ్గ తనయుడిగా యాక్షన్ తరహా చిత్రాలలో నటిస్తూ మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. పెద్ద కృష్ణ కొడుకు రమేష్ బాబు కూడా హీరోగా నటించి ఆ మధ్య కన్నుమూశారు. ఈ మధ్య సెలబ్రెటీలు సోషల్ మీడియాల్లో తమ స్వీట్ మెమరీస్ పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు హీరోగా నెంబర్ వన్ రేస్ లో ఉన్నాడు. కృష్ణ చిన్న అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కృష్ణ చిన్న కూతురు, మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు 2006 లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. సుధీర బాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. నేడు సుధీర్ బాబు తన వివాహ వార్షికోత్సవం కావడంతో పెళ్లి చూపుల నాటి తన భార్య ప్రియదర్శిని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘హ్యాపీ యానివర్సరీ మై లవ్.. నా దగ్గిరికి వచ్చిన ఫస్ట్ ఫోటో’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో ప్రియదర్శిని బాబు బొమ్మలా ఎంతో అందంగా కనిపిస్తుంది.
సినిమాల్లోకి రాక ముందు సుధీర్ బాబు బ్యాడ్మింటన్‌లో నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్నాడు. 2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమ కథా చిత్రమ్‌తో మంచి విజయం అందుకొని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 2016లో బాఘీతో చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. హిట్ట్..ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకు పోతున్నాడు సుధీర బాబు. తాజాగా సుధీర్ బాబు షేర్ చేసిన తన భార్య ప్రియదర్శిని ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కుందనపు బొమ్మలా ఉందని, బాబూ గీసిన చిత్రంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.