ఆన్ ది స్క్రీన్ యాక్టింగ్..ఆఫ్ ది స్క్రీన్ ఒరిజినల్..నందమూరి బాలకృష్ణ (బాలకృష్ణ)ఒరిజినల్ లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉంటుంది. మనసులో ఉన్నది మాత్రమే మాట్లాడతాడు. అందుకే అభిమానులు దేవుడిలా కొలుస్తారు. ఒకటి కాదు రెండు కాదు మూడు దశాబ్దాల నుంచి ఎన్నో హిట్ సినిమాల్లో చేస్తు తెలుగు సినీ కళామతల్లి ఒడిలో ఓలలాడుతూ వస్తున్నాడు. అలాగే తన తల్లి పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని నెలకొల్పి ఎంతో మంది పేద వాళ్ళ ప్రాణాలని నిలబెడుతున్నాడు తాజాగా బాలకృష్ణ లో ఉన్న మరో కోణం బయటపడింది. దీంతో బాలయ్య ప్రేమ ఈ విధంగా ఉంటుందా అని అందరు మాట్లాడుకుంటున్నారు
విశ్వక్ సేన్(vishwak sen) హీరోగా వస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(gangs of godavari) ఈ నెల 31 న విడుదలైంది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ముందుగా తనకి ధన్యమైన జన్మనిచ్చి ప్రేక్షకుల హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు తన తండ్రి ఎన్టీఆర్ ని స్మరించుకున్నాడు. విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో తన తండ్రి చెప్పాడని ఆయన పుట్టిన రోజు సందర్భంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేడుక జరగడం ఆనందంగా ఉందని తెలిపాడు. అనంతరం విశ్వక్ సేన్ గురించి మాట్లాడటం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను,విశ్వక్ ని కావల పిల్లలు అని అనుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వక్ నా అన్న లాంటి వాడు. కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటాను .వాళ్ళల్లో విశ్వక్సేన్ కూడా ఒకడు.నాలాగే ఉడుకు రక్తం, దూకుడు ఉన్న వ్యక్తి. సినిమా సినిమాకీ, పాత్రల మధ్య కొత్తదనం చూపించు ప్రయాణం చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అదే విధంగా సినిమా హిట్ కావాలని కూడా కోరుకోవడంతో పాటు మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ని కూడా అభినందించారు.
ఈ సందర్భంగా తన కొడుకు మోక్షజ్ఞ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. మోక్షజ్ఞ(మోక్షజ్ఞ)వెనుకాల నేను లేను. నటనలో నన్ను గాని తాతని గాని ఇన్స్పిరేషన్ గా తీసుకోవద్దని చెప్తుంటాను. యువ హీరోలు విశ్వక్ సేన్ ని, సిద్దు జొన్నలగడ్డ ని,అడవి శేషు ని ఇన్స్పిరేషన్ గా స్టార్ చెప్తుంటాను. ఏది ఏమైనా బాలయ్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.