డైరెక్టర్ శంకర్.. ఈయన టాలెంట్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఎనలేని ఆదరణ లభించింది. ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ కు తెలియజేశాడు. ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలను ప్రదర్శించాడు. ఇంకా డైరెక్టర్ గా తన మార్క్ చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇండియన్ 2 సినిమాతో కమల్ హాసన్- శంకర్ ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు. అయితే ఈ మూవీలో ఎందుకో శంకర్ మార్క్ మ్యాజిక్ మిస్ అయినట్లు ప్రారంభించారు. అందుకు తాజాగా విడుదలైన సెకడం సింగిలే కారణంగా చెప్పచ్చు.
సాధారణంగా శంకర్ సినిమా అంటే సినిమా అభిమానుల నుంచి వచ్చే రెస్పాన్స్, వాళ్లు పెట్టుకునే ఎక్స్ పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. వాటిని ఏమాత్రం తగ్గించకుండా శంకర్ తన సినిమాని ప్రదర్శించాడు. ఇప్పటికే కమల్ హాసన్ తో తీసిన భారతీయుడు సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో అందరికీ తెలుసు. ఆ సినిమా సీక్వెల్ కోసం సినిమా లవర్స్ చాలా ఏళ్లు ఎదురు చూశారు. వారి కలలను నెరవేరుస్తూ ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ఇక్కడే ఎందుకే శంకర్ తప్పు చేశాడు అనే అభిప్రాయాలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. అది మరీ ముఖ్యంగా సినిమా మ్యూజిక్ విషయంలో స్పష్టంగా కనిపించింది.
అసలు డైరెక్టర్ శంకర్ సినిమా అంటే సోషల్ కాజ్, పెద్ద సెట్లు, భారీ ఫైట్స్ మాత్రమే కాదు. అద్భుతమైన పాటలు కూడా. శంకర్ సినిమా అంటే పాటలు లేకుండా ఆ సినిమాని ఊహించుకోలేం. అలాగే ఆ పాటలు ఏ భాషలో అయినా తప్పకుండా సూపర్ డూపర్ హిట్టు అవుతాయి. కానీ, ఈసారి భారతీయుడు 2 విషయంలో ఫీల్ కనిపించడం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారతీయుడు సినిమాలో ఒక్కో సాంగ్ ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ హిట్స్ గానే ఉన్నాయి. ఆ మూవీకి కథ, కమల్ హాసన్ ఎంత ప్రాణం పోశారో.. ఏఆర్ రెహ్మాన్ కూడా అంతే కీలకంగా ఉన్నాడు. కానీ, ఇండియన్ 2 మూవీకి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించే విషయం తెలిసిందే.
అయితే ఇక్కడ అనిరుధ్ ని తక్కువ చేయడం కాదు. అనిరుధ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు. కానీ, ఏఆర్ రెహ్మాన్ పట్టుకున్నంతగా.. శంకర్ పల్స్ ని పట్టుకోవడంలో అనిరుధ్ ఎందుకో మిస్ ఫైర్ అయినట్లు. అనిరుధ్ తన స్టైల్ లో భారతీయుడు 2కి కొత్త టచ్చ ఇవ్వడంతో ఆడియన్స్ ఎందుకే రిసీవ్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ వచ్చాయి. జూన్ 1వ తేదీన ఆడియో లాంఛ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఈ సినిమాపై సరైన బాజ్ లేదు. పాన్ ఇండియా లెవల్లో రీసౌండింగ్ వచ్చేలా ఈ సినిమా గురించి చర్చలు జరగడం లేదు. రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసినా ఆ హడావుడి కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలోనే ఏఆర్ రెహ్మాన్ ని తీసుకోకుండా శంకర్ తప్పు చేశాడు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారతీయుడు 2 విషయంలో డైరెక్టర్ శంకర్ తప్పు చేశాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.