ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ కాదాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మూవీకి సెన్సాస్ బోర్డు యూఏ సర్టిఫికేషన్ జారీ చేసింది. ఇంకో రెండ్రోజుల్లో టైగర్ రత్నం గురించి తెలుగు ప్రజలు మాట్లాడబోతున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అట్టహాసంగా చేసింది. ఈవెంట్ ముఖ్య అతిథిగా విశ్వక్ సేన్ అభిమాన నటుడు నందమూరి బాలయ్య పాల్గొన్నారు. స్టేజ్ మీద బాలయ్య ఉంటే అక్కడి వాతావరణం అంతా సరదాగా మారిపోతుంది. అయితే హీరోయిన్ అంజలికి మాత్రం బాలయ్య బాబు పెద్ద షాకే ఇచ్చాడు. అక్కడే ఉన్న నేహా శెట్టి కూడా అవాక్కైంది.
మే 31న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటి నుంచి ఆ హంగామా అయితే తయారైంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడంతో ఆ హడావుడ్ రెట్టింపు అయ్యింది. అదంతా ఒకెత్తు అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య ముఖ్య అతిథిగా రావడం సినిమాని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. బాలయ్య మాట్లాడుతూ విశ్వక్ సేన్ ని కూడా ఆకాశానికి ఎత్తేశాడు. అడవి శేష్, విశ్వక్ సేన్ లాంటి కుర్రాళ్లను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని చెప్తానని చెప్పాడు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్టేజ్ పై తన డైలాగులు, స్పీచ్ తో అదరగొట్టిన బాలయ్య తాను చేసిన ఒక పనితో అందరికీ షాకిచ్చాడు.
అసలు ఏం జరిగిందంటే.. స్టేజ్ మీద బాలకృష్ణ, నేహాశెట్టి, అంజలి పక్కన నిల్చొని ఉన్నారు. బాలకృష్ణ.. అంజలిని కాస్త పక్కకు జరగమని చెప్పాడు. ఆమె కొంచం పక్కకు జరిగింది. ఇంకోసారి జరగమని చెప్పకుండా ఒక్క తోపు తోశాడు. వీళ్ల మధ్యలో ఉన్న నేహాశెట్టి కూడా ఒక్కసారిగా షాకైంది. కానీ, అంజలి- నేహా శెట్టి నవ్వుతూనే ఉన్నారు. కాసేపు బాలయ్య ముఖం మాత్రం సీరియస్ గా కనిపించింది. కానీ, వెంటనే నవ్వేశాడు. అలాగే అంజలితో మళ్లీ ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఆమె కూడా నవ్వుతూ బాలయ్యకు సమాధానం చెప్పింది. అలాగే బాలకృష్ణ తర్వాత అంజలికి నవ్వుతూ హైఫై కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అంజలి ఆ సమయంలో సరదాగానే తీసుకున్నా.. నెటిజన్స్ మాత్రం కాస్త సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే బాలయ్యకు అస్సలు ఎలా ప్రవర్తించాలో తెలియదు అంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకొందరు ఆ సందర్భంలో అంజలి ఏడవలేక నవ్వుతూ కవర్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు అభిమానులు మాత్రం ఈ చర్యను కూడా సమర్థిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా బాలయ్య.. బాలయ్య అంటూ కామెంట్స్ చేయడం. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది. బాలకృష్ణ హీరోయిన్ అంజలిని తోయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.