తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రకథానాయకుడిగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరింజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి నేడు ఎంతో మంది యువ నటుల సినీ ప్రవేశానికి రోల్ మోడల్‌గా నిలిచారు. తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు మెగాస్టార్ చిరంజీవి. తరాలతో సంబంధం లేకుండా చిరంజీవికి లక్షలాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఆపద్భాందవుడిలా మారారు చిరంజీవి. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించేందుకు హీరోయిన్లు పోటీ పడేవారు. హీరోయిన్స్ పట్ల ఎంతో గౌరవ మర్యాదలు ఉండే మెగాస్టార్ ఒకరిని కౌగిలించుకున్న ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం రావాలని హీరోయిన్స్ కోరుకుంటారు. ఒక్కసారి మెగాస్టార్ తో తెరపంచుకోవాలని ఆరాటపడుతుంటారు. మెగాస్టార్ తో పాపులర్ హీరోయిన్స్ రాధిక, సుహాసిని, ఇలా పలువురు హీరోయిన్లు చిరంజీవితో చాలా సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు భారీ విజయాలతో సరికొత్త రికార్డులు సృష్టించాయి. అయితే హీరోయిన్ల పట్ల ఎంతో గౌరవంగా ఉండే మెగాస్టార్ లేడీ గెటప్ లో ఉన్న వ్యక్తిని కౌగిలించుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలరా? ఆ లేడీ గెటప్ లో ఉన్నది మరెవరో కాదు.. తెలుగు సినిమా స్టార్ కమిడియన్ అలీ.
నటుడు అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో విభిన్నమైన పాత్రలను ప్రేక్షకులు మదిలో చెరగని ముద్ర వేశారు. తన కామిడీ టైమింగ్ తో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను అలరించే వారు. కాగా అలీ పలు సినిమాల్లో లేడీ గెటప్ లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఓ సందర్భంలో లేడీ గెటప్ లో అలీ ఉండగా మెగాస్టార్ చిరంజీవి హత్తుకున్న పిక్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మూవీ ఫంక్షన్లకు మెగాస్టార్ గెస్టుగా వెళ్తారు. అలా వెళ్లిన సందర్భంలో లేడీ గెటప్ లో ఉన్న అలీని మెగాస్టార్ కౌగిలంచుకున్న ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.