తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కుర్ర హీరోల హవా నడుస్తుంది. ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా సత్తా చాటాలని వచ్చిన తర్వాత హీరోలుగా మారిన విషయం తెలిసిందే. రవితేజ, నాని లాంటి వారు అసిస్టెంట్ డైరెక్టర్లుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోలుగా మారారు. తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయితగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోగా మారాడు విశ్వక్ సేన్. 2017లో వెళ్లిపోమాకే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విశ్వక్ సేన్ తర్వాత ‘ఫ’ల’క్‌నుమాదాస్’తో దర్శకుడు, నటుడిగా మంచి విజయం సాధించాడు. ఇటీవల స్వియ దర్వకత్వంలో వచ్చిన ‘దాస్ కా దమ్కీ’తో మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందమూరి హీరోలతో ఈ కుర్ర హీరోకి మంచి సంబంధాలు ఉన్నాయి.. అది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక ట్రెండ్ సృష్టించారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు బాలకృష్ణ ఎన్నో రకాల పాత్రలు వేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తాత, బాబాయి బాటలో నడుస్తూ జూనియర్ ఎన్టీఆర్ తనదైన డ్యాన్స్, నటనతో ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఆత్మీయులుగా ఉండటం చాలా కష్టం.. కానీ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం బాలకృష్ణ, ఎన్టీఆర్ కి మంచి ఆప్తుడిగా మారాడు. మరి అది ఈ హీరోకు ఎలా సాధ్యమైందన్న విషయం వస్తే.. మొదటి నుంచి విశ్వక్ నందమూరి హీరోలు అంటే పిచ్చి అభిమానం. బాలకృష్ణకు హార్డ్ కోర్ ఫ్యాన్. ఏ ఈవెంట్ కి వెళ్లినా ఏదో ఒక సందర్భంలో జై బాలయ్య అంటూ నినదిస్తుంటారు. విశ్వక్ సేన తన సినిమాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రతిసారి బాలయ్యను ఆహ్వానిస్తారు. పలు సందర్భాల్లో.. విశ్వక్ సేన్ గురించి గొప్పగా పొగడటమే కాదు.. తన కుటుంబ సభ్యుల్లో ఒకడిగా ఉంటాడని బాలకృష్ణ చెబుతూ ఉండేవారు.
మే 28న యుగపురుషుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విశ్వక్ నేనూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. బయట చూస్తే మమ్మల్ని కవలలే అంటారు. సినీ పరిశ్రమలో నాకు కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. వారిలో విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ ప్రయాణం మొదటి నుంచి చూస్తున్నా.. తను కూడా నాలాగే సినిమా సినిమాకి.. ప్రతి పాత్రకు కొత్తదనం చూపించాలనే ప్రయత్నం చేశాడు.. ఉడుకు రక్తం, నాలాగే దూకుడు ఎక్కువ’ అని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా విశ్వక్ సేన్ మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఏ ఈవెంట్ లో అయినా సరే ఇండస్ట్రీలో నాకు మంచి సోపోర్ట్ చేసే గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని చెబుతారు విశ్వక్. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్ పర్ఫామెన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతుంటాడు.
‘దాస్ కా ధమ్కీ’ మూవీ ఈవెంట్‌కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి విశ్వక్ గురించి ఎంతగానో పొగిడారు. ఇలాంటి యంగ్ హీరోలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం అంటూ ఆకాశానికి ఎత్తాడు. ఎన్టీఆర్ బ్లెసింగ్ తో మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవల టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ పాల్గొని విశ్వక్ గురించి గొప్పగా మాట్లాడారు. ఆ మధ్య బేబీకి సంబంధించిన వివాదంలో విశ్వక్ సేన్ పై చాలా విమర్శలు వచ్చాయి.. కానీ ఎన్టీఆర్ అతనికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మొత్తానికి ఈ యంగ్ డైరెక్టర్, నటుడు విశ్వక్ సేన్ కి నందమూరి ఫ్యామిలీ హీరోల బ్లెసింగ్స్ వల్ల మంచి అదృష్టవంతుడు అని టాక్ వినిపిస్తోంది.