ఇప్పటివరకు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా దాదాపు ఓటీటీలోకి వచట్లే. ఆయా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ.. ఆయా సినిమాలు ఓటీటీలోకి మాత్రం శరవేగంగా ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సుహాస్ నటించిన సినిమాలంటే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్న వదనం సినిమాలనే అందరికీ తెలుసు. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. డీసెంట్ టాక్ ను సంపాదించుకున్నాయి. కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నా కానీ.. కథ పరంగా మాత్రం ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. అయితే ఈ రెండు సినిమాలకు మధ్యలో సుహాస్ నటించిన మరో సినిమా శ్రీరంగ నీతులు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి.
శ్రీరంగ నీతులు సినిమా ఏప్రిల్ 11 వ తేదీన థియేటర్ లో విడుదల అయింది. ఇక ఈ సినిమా ముందు వెనుక వచ్చిన సుహాస్ రెండు సినిమాలు కూడా అటు థియేటర్ లోను, ఇటు ఓటీటీ లోను మంచి టాక్ నే సంపాదించుకుంటున్నాయి. కానీ శ్రీరంగ నీతులు సినిమా మాత్రం అసలు రిలీజ్ అయినట్లుగా కూడా ఎవరికి తెలియదు. పోనీ ఓటీటీ లో అయినా రిలీజ్ అయిందా అంటే అది కూడా లేదు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ బజ్ వినిపించింది. ఈ సినిమా జూన్ 7 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ అంటే టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా.. అనుకున్న దానికంటే ముందే ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇందులోనే కాకుండా మరో ప్లాట్‌ఫార్మ్‌లో కూడా ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ సంస్థ. ఈ చిత్రం మే 30 నుండి యూట్యూబ్‌లో శ్రీభవాని హెచ్‌డి మూవీస్ ఛానెల్‌లో ప్రసారం చేయబడుతుంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించింది.
అయితే, ఇప్పటివరకు థియేటర్లలో విడుదలైన సినిమాలు కాస్త ఆలస్యం అయినా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్స్‌లోకి వచ్చేవి. కానీ, ఇలా డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి మాత్రం వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ సినిమా అటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ లోను, ఇటు డైరెక్ట్ గా యూట్యూబ్ లోను రానుంది. దీనితో ఈ సినిమా డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి రావడంతో ప్రేక్షకులు కాస్త ఆశ్చర్య పోయి.. అసలు దాని వెనుక ఉన్న కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. ఈ సినిమా థియేటర్ లో ఘోరంగా విఫలం అవ్వడం వలనే.. ఓటీ డీల్ సరిగా జరగలేదా అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత ఎంత మందిని మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
యొక్క గొప్పతనాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి #శ్రీరంగనీతులు భారీ అంచనాలున్న ఈ చిత్రం మే 30న ప్రీమియర్గా ప్రదర్శించబడుతోంది!#రుహాని శర్మ #విరాజ్ అశ్విన్#సుహాస్ #కార్తీకరత్నం #తనికెళ్ల భరణి #శ్రీనివాస్ అవసరాల @bhavanidvd @భవాని హెచ్‌డి సినిమాలు pic.twitter.com/91lNghtGid
— భవాని మీడియా (@BhavaniHDMovies) మే 28, 2024