ఏది ఏమైనా తెలుగు సినిమా ప్రేక్షకులు అసలు సిసలు భారతీయులు. అదేంటి మిగతా వాళ్ళు కాదా అని అంటారా. మిగతా బాషా ప్రేక్షకులు కూడా భారతీయులే. కానీ నేను పర్టిక్యులర్ గా తెలుగు సినిమా ప్రేక్షకులు అని ఎందుకు అంటున్నానంటే మన వాళ్ళు పరభాషా చిత్రాలను ఆదరించిన తీరుకి.. అలా ఆదరించడం వలన ఒరిజినల్ తెలుగు సినిమాకి మించి కోట్ల రూపాయిల కనకవర్షం.
కాస్టింగ్ ఎవరైతే మాకేంటి సినిమా బాగుందా లేదా! తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచి ఫిక్స్ చేసుకున్న సిస్టమ్. అందుకు రుజువు నాలుగు దశాబ్దాల పైనే. రజనీకాంత్ (rajni kanth) కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ లే కాదు సూర్య, కార్తీ, విజయ్, అజిత్, శివ కార్తికేయన్, రిషబ్ శెట్టి ఇలా చాలా మంది హీరోలు నటించిన సినిమాలు తెలుగు సిల్వర్ స్క్రీన్ వద్ద కనక వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా పర భాషా చిత్రాలు సాధించిన కలెక్షన్ల గురించి చర్చ నడుస్తుంది.మచ్చుకి కొన్ని సినిమాల వివరాలు చూద్దాం.రజనీ జైలర్ (జైలర్)12 కోట్ల బిజినెస్ తో తెలుగులో రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ ని అందుకొని ఏకంగా 47.90 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో జైలర్ తెలుగు రిలీజ్ చేసిన దిల్ రాజు (dil raju) కి 35.90 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతారా(కాంతారావు) మూవీ 2 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయ్యింది. 29.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. అక్కడ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ (allu aravind) కి 27.65 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. పైగా ఒక కన్నడ మూవీ తెలుగునాట ఆ స్థాయి వసూళ్లు సాధించడం అదే ఫస్ట్ టైం. ఇవే కాకుండా విజయ్(విజయ్) లియో 20 కోట్లు గతంలో వచ్చిన కమల్ విక్రమ్ 33 కోట్లు, సాధించారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్ కూడా పరభాషా మూవీ కిందనే వస్తుంది. తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ ని సృష్టించింది.
ఇలా పరభాషా చిత్రాలు తెలుగు నాట రికార్డులు సాధిస్తుంటే అచ్చ తెలుగు సినిమాలు మాత్రం ఆ స్థాయి కలెక్షన్స్ ని సాధించలేక పోతున్నాయి. కేవలం భారీ సినిమాలు మాత్రమే కలెక్షన్లు రాబడుతున్నాయి. పైగా డబ్బింగ్ సినిమాల బిజినెస్ ని గమనిస్తే చాలా తక్కువ అమౌంట్ కే హక్కులను పొందుతున్నారు. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల ఆదరణతో కోట్ల లాభాన్ని చవి చూస్తున్నారు. గతంలో కూడా విజయ్ ఆంటోనీ బిచ్చగాడు మూవీ కేవలం 50 లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 16.80 కోట్ల షేర్ సాధించింది. అంటే తెలుగు రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ కి 16.20 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన డబ్బింగ్ సినిమాలలో ఇదే హైయెస్ట్ షేర్ పర్సంటేజ్ అని చెప్పాలి.