మీరు కారులో వెళ్తున్నారు. పోలీసులు మీ కారుని ఆపి మీతో కారుని చెక్ చేయాలి, వెనుక డిక్కీ ఓపెన్ చేస్తారా అని అడిగారనుకోండి. ఏం చేస్తారు. జనరల్ సెర్చ్ అయి ఉంటుందిలే అనుకోని పోలీసులకి సహకరిస్తారు. ఆ తర్వాత మీ పని మీద మీరు వెళ్ళిపోతారు. కానీ ప్రముఖ హీరోయిన్ నివేదా మాత్రం తెగ కంగారుపడిపోయింది.
నివేదా పేతురేజ్(Nivetha pethuraj)2017 లో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన బ్రోచేవారెవరురా తో తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ తో పాగల్, ధమ్కీ, సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, రామ్ రెడ్ మూవీస్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. బన్నీ అల వైకుంఠ పురం లో కూడా ఒక ముఖ్య పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నివేదా కారుని పోలీసులు ఆపి చెక్ చెయ్యాలని అడిగారు. అందులో భాగంగా కారు డిక్కీ ఓపెన్ చేసింది. చాలా మర్యాదపూర్వకంగానే అడుగుతున్నారు నివేదా మాత్రం తటపటాయిస్తూనే ఉంది.అంటే వాళ్లకి సహకరించటం లేదు. కానీ పోలీసులు మాత్రం ఎంతో ఓపిగ్గా కారు డిక్కీ ఓపెన్ చేయమని అడుగుతూనే ఉన్నారు. అందుకు ఆమె సముఖంగా లేదని ఎక్స్ ప్రెషన్స్ చూస్తే అర్ధమవుతుంది. తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అంటూ పోలీసుల కన్విన్స్ చేస్తుంది. పైగా మీకు చెప్పినా అర్థం కాదని అంది. పోలీసులు మాత్రం చెక్ చెయ్యాల్సిందే అన్నారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అది చూసిన నివేదా కంగారుపడిపోయి ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఫైర్ అవుతు కారు దిగింది. అంతవరకే వీడియో ఉండటంతో ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు.
కాకపోతే ఈ వీడియో ప్రెజంట్ దా లేక గతంలో ఉందా అనేది తెలియదు. పోనీ ఏదైనా కొత్త సినిమాకి సంబంధించిన వీడియో అనుకుందాం అంటే ప్రస్తుతం నివేదా కొత్త సినిమా ఏది షూటింగ్ జరుపుకోవడం లేదు. పబ్లిసిటీ కోసం సరదాగా చేస్తున్న ఫ్రాంక్ వీడియో అనుకోవచ్చు. ఏది ఏమైనా మళ్ళీ సోషల్ మీడియానే నిజం చెప్తుంది.విచిత్రం ఏంటంటే ఆ వీడియో తెలుగు నాట జరిగిందే. తమిళనాడు కి చెందిన నివేద తమిళంలో పలు సినిమాలు చేసింది.