హీరోయిన్ ‘నివేదా పేతురాజ్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాగా, టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అయితే ఈమె మొదటిగా తెలుగులో మెంటల్ మదిలో అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ కోరికనే.. చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అలా వైకుంఠపురం, రెడ్, పాగల్, ధమ్కీ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఎక్కువగా ఈ అమ్మడుకు పాగల్, దమ్కీ సినిమాలతోనే మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇంకా.. ఇటు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది. ఇకపోతే తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. ఇదిలా ఉంటే.. గత కొన్నాళ్లుగా నివేదా ఏ కొత్త సినిమాల్లో నటించడం కానీ, అనౌన్స్ చేయడం కానీ చేయలేదు. ఇంకా బయట ఎక్కడా కూడా కనిపించడం లేదు. కానీ, తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకి ఏం జరిగిందంటే..
గత కొన్నేళ్లుగా హీరోయిన్ నివేదా పేతురాజ్ ఏ కొత్త సినిమాలో నటించడం కానీ, అనౌన్స్ చేయడం కానీ చేయలేదు. ఇంకా బయట ఎక్కడ కూడా ఈ అమ్మడు కనిపించడం లేదు. అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఆ వీడియోలో నివేదా పోలీసులతో వాధిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే.. తాజాగా నివేదా వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయించారు. ఇక ఆమె ప్రయాణిస్తున్న కారు డిక్కీ కూడా ఓపెన్ చేయాలని కోరగా.. అందుకు నివేదా నిరాకరించింది. పైగా తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పిన అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే నివేదాకు,పోలీసులకు జరుగుతున్న ఈ సంఘటన పక్కనే ఉన్న ఓ వ్యక్తి రికార్డ్ చేయగా.. ఈ బ్యూటీ అతనిపై కూడా ఫైర్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా డిక్కీ ఓపెన్ చేస్తే సరిపోయేదిగా ఇలా పోలీసులతో వాగ్వాదం ఎందుకు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి, హీరోయిన్ నివేదా పోలీసులతో గొడవ పడుతున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
నటి #నివేతా పేతురాజ్ వాదించారు మరియు కారు వెనుక ట్రంక్ తెరవడానికి వెనుకాడారు మరియు రికార్డ్ చేసిన వ్యక్తిని తిట్టారు…
ఆమె మాటలు పోలీసులకి తనపైనే అనుమానం వచ్చేలా చేశాయి…#టాలీవుడ్ #నివేతా పేతురాజ్ #పోలీసు pic.twitter.com/49W6DNPcdL
— యాంకర్_కార్తీక్ (@Karthikkkk_7) మే 29, 2024