బాహుబలి (baahubali) సిరీస్‌లో అద్భుతంగా నటించిన ఇండియన్ మూవీ లవర్స్ ని తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన హీరో ప్రభాస్ (prabhas)ఇందులో ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. పైగా ప్రభాస్ వల్ల వరల్డ్ మూవీ లవర్స్ కూడా తెలుగు సినిమా వైపు చుస్తున్నారని చెప్పవచ్చు. లేటెస్ట్ గా సలార్ తో అదిరిపోయే హిట్ కొట్టి తన కట్ అవుట్ కి ఉన్న వాల్యూ చెప్పాడు.దీంతో ఇప్పుడు అందరి దృష్టి కల్కి మీద పడింది. ఈ ఒక తాజా వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మొన్ననే బుజ్జి పరిచయంతో కల్కి (కల్కి) మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.తెలుగు సినిమా ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమవుతుందనే నమ్మకం అందరిలో ఏర్పడింది. దీంతో నిత్యం కల్కి కి సంబంధించిన అప్ డేట్ కోసం ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు సోషల్ మీడియాలో చెక్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాసెస్ లో ఒక న్యూస్ వాళ్ళల్లో ఆనందాన్ని తెస్తుంది. కల్కి మూడు గంటల నిడివితో అభిమానులని కనువిందుచేయనుంది. అంటే బొమ్మ సిల్వర్ స్క్రీన్ మీద మూడు గంటల పాటు రన్ అవ్వనుంది. కల్కి బృందం అధికారకంగా ప్రకటించకపోయినా మూడు గంటల నిడివి న్యూస్ మాత్రం బాగానే వైరల్ అవుతుంది. ఇప్పుడు మాములు సినిమాలే మూడు గంటల నిడివితో తెరకెక్కుతున్నాయి. అలాంటిది కల్కి లాంటి టైం ఫిక్షన్ మూవీకి మూడు గంటల నిడివి అంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. యానిమల్ కూడా మూడు గంటల నిడివి తో వచ్చిన విషయం తెలిసిందే
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి లో డార్లింగ్ తో పాటు యూనివర్సల్ నటుడు కమల్ హాసన్(కమల్ హాసన్) ఇండియన్ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్(అమితాబ్ బచ్చన్)లు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మహాభారతంలోని ద్రోణుడి కుమారుడు అయిన అశ్వత్థామ గా అమితాబ్ చేస్తున్నాడు. ఈ భూమ్మీద ఇంకా బతికి ఉన్న సప్త చిరంజీవులలో అశ్వత్థామ కూడా ఒకడు. మరి అశ్వత్థామ కి ప్రభాస్ కి ఉన్న లింక్ ఏంటో తెలియాలి. అలాగే కమల్ క్యారక్టర్ ఏంటి.. ప్రభాస్ తో ఉన్న లింక్ ఏంటి అంటే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొని ఉంది. దీపికా పదుకునే హీరోయిన్ గా చేస్తుండగా దిశా పటాని ఒక ప్రత్యేక పాత్రలో మెరవనుంది.ప్రెజంట్ ఇండియాలో నలుగురు కలిసిన కల్కి గురించి చర్చించుకుంటున్నారు.