సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్ హీరోహీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. కోటమంది రాజకీయ నేతల తనయులు, క్రీడా రంగానికి చెందిన వారి వారసులు హీరో-హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ ఒకరు. ఈమె తండ్రి ప్రకాశ్ పడుకోన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ పై దృష్టి పెట్టండి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్‌లో రాణించింది.ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకొని స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్‌లోకి వెళ్లింది. తాజాగా దీపికా పడుకోన్ కి అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కి అరుదైన గౌరవం దక్కింది. బాలీవుడ్ లోనే కాదు..హాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీస్ తో ఆకట్టుకుంటుంది. తన సహ నటుడు రణ్ వీర్ సింగ్ ని వివాహమాడింది. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దీపికా 2006లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘ఐశ్వర్య’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2007లో షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘ఓం శాంతి ఓం’ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి హిట్ కావడంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ హాట్ బ్యూటీ.
దీపికా పదుకోన్ కి అరుదైన గౌరవం దక్కింది.. అంతర్జాతీయంగా పేరుపొందిన ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎమ్‌డీబీ గత పదేళ్లుగా ఎంతో ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో దీపికా పడుకోన్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సమంత 13వ స్థానంలో నిలిచింది. ‘టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్’ పేరుతో పదేళ్లుగా పాపులర్ అయిన ఐఎండీబీ సినీ సెలబ్రెటీల జాబితా విడుదల చేసింది. ఇందులో ఎంతోమంది అగ్ర తారలను పక్కకు నెట్టి దీపిక పడుకోన్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం. ఈ గుర్తింపు తనకు మరింత ప్రోత్సాహం ఇస్తుందని.. ఇంతమంది ప్రేమను పొందినందుకు చాలా సంతోషంగా ఉందని దీపికా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.