సమ్మర్ రావడంతో కూల్ వెదర్ కోసం పర్యాటక ప్రాంతాలకు వెళుతుంటారు సినీ సెలబ్రిటీలు. బీచ్‌లు, రీసార్ట్స్, చల్లని ప్రదేశాల్లో సేద తీరుతుంటారు. తాజాగా టాలీవుడ్ యాంకరమ్మ, ఇప్పుడు వెండితెరపై రంగమ్మత్తగా అలరించిన అనసూయ తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌కు వెళ్లి చిల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ నెట్టింట్లో షేర్ చేసి.. మతి పొగొడుతోన్న విషయం తెలిసిందే. ఇక కాలంతో పని లేకుండా.. గ్యాప్ దొరికితే కుటుంబంతో విదేశాలకు వెళ్లిపోతుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. చాలా మంది అలా ప్రకృతి ఒడిలోకి చేరి.. పులకరించి పోతుంటారు. తాజాగా మరో ముద్దుగుమ్మ కూడా అమెరికాను తన అందచందాలతో హిట్ ఎక్కిస్తోంది. ఇంతకు ఆమె ఎవరంటే..?
న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మెహ్రీన్ ఫిర్జాదా. సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ జోష్‌లో ఉండే హనీ పాప (ఎఫ్ 2లో పాత్ర పేరు) తనఫోటో షూట్‌లతో కుర్రకారును నిద్ర లేకుండా చేస్తుంది. అమెరికా వెకేషన్‌కు వెళ్లిన భామ.. అక్కడ రిసార్ట్స్, బీచ్‌ల్లో బికినీ వేసి అంద చందాలను ప్రదర్శిస్తోంది. మెహ్రీన్‌ని ఇలా ఎప్పుడూ చూడలేరు. బ్లాక్ బికినీపై ఓ వైట్ ఫ్లవర్ డ్రెస్ వేసుకుని, ఫోటోలకు ఫోజులిస్తుంది. ఊయలలో ఊగుతూ యూత్‌కు కనువిందు చేస్తుంది మెహ్రీన్. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ అమ్మడి పిక్స్‌కు అబ్బాయిలే కాదు.. హీరోయిన్లు కూడా మెల్ట్ అయిపోతున్నారు. సోనాల్ చౌహాన్ లవ్ ఎమోజీలను డ్రాప్ చేసింది. ఇక మెహ్రీన్ కెరీర్ విషయానికి వస్తే..
కృష్ణగాడి వీర ప్రేమగాధ తర్వాత శర్వానంద్ మహానుభావుడు చిత్రంలో నటించింది. రాజా ది గ్రేట్, జవాన్, పంతం, కవచం వంటి చిత్రాలు చేసింది. కానీ ఆమెకు బాగా పేరు తెచ్చింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2. ఇందులో హనీ ఈజ్ ద బెస్ట్ అనే డైలాగుతో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత చాణక్య, ఎంత మంచివాడవురా.. అశ్వత్థామ మూవీకి మంచి మార్కులే పడ్డాయి. మంచి రోజులొచ్చాయ్ ఓకే అనిపించినా.. మళ్లీ ఎఫ్ 3తో పుంజుకుంది. అక్కడ నుండి మెరపులు చూపించలేకపోయింది మెహ్రీన్. వీటితో పాటు హిందీ, పంజాబీ, తమిళ సినిమాలు కూడా చేసింది. ఓ కన్నడ చిత్రంలో నటించింది. అది విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎటువంటి సినిమాలు లేనట్లు కనిపిస్తున్నాయి. దీనితో సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ కనువిందు చేస్తుంది.