సినీ, రాజకీయ రంగాలకు సంబంధించి ఏదో ఒక వార్త వస్తోంది. వారి వ్యక్తిగత, కుటుంబ విషయాలతో పాటు పలు ఇతర అంశాల్లో వారు వార్తల్లో నిస్తుంటారు. మరికొందరు సెలబ్రిటీలు అయితే పలు స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటుండగా, మరికొందరు మొత్తం నేరుగా దొరికిపోతున్నారు. ఈ పలు స్కామ్ లో కొందరు సెలబ్రిటీలు నోటీసులు అందుకుని విచారణకు హాజరవుతారు. తాజాగా ఓ సినీ నటికి కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మరి.. ఆ నటి ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో కొన్ని సినీ రంగానికి చెందిన వారు వివిధ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీ విషయంలో సినీ నటి హేమ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆమె తో పాటు మరికొందరు సినీరంగానికి చెందిన వారు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికీ నోటీసులు జారీ చేసి.. విచారణకు పిలిచింది. తాజాగా మరో నటి ఓ స్కామ్ లో ఇరుకుంది. రేషన్ కుంభకోణంలో బెంగాలీ నటి రితుపర్ణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కోట్లాది రూపాయలు దారి మళ్లించి భారీ స్కామ్ కి విచారణరంటూ ఆరోపిస్తూ..ఈడీ సమన్లు జారీ చేసింది. రేషన్ స్కామ్ ద్వారా సంపాదించిన డబ్బును బెంగాలీ సినీ ఇండస్ట్రీలో ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఆమెకు సంబంధించిన సినీ బ్యాంక్ అకౌంట్ల వివరాలతో నిజాం ప్యాలెస్‌లోని ఆఫీస్ కి రావాలని రావాలని ఈడీ సేన్‌గుప్తాకు జూన్ 4వ తేదీన అధికారులు తెలిపారు. 2019లో బెంగాల్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మనీ లాండరీంగ్ చేసినట్టు ఆరోపణ నేపథ్యంలో గతంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేశాయి. 2019లో రోజ్ వ్యాలీ పోంజీ స్కామ్‌కు సంబంధించి కూడా నటి రితుపర్ణ సేన్‌గుప్తాను విచారించింది.
ఇలా సినీ రంగానికి చెందిన వారు స్కామ్ లో ఇరుక్కోవడం కొత్తేమి కాదు. ఇప్పటికే కొందరు బాలీవుడ్ కి చెందిన వారు సినీ నటులు కూడా పలు కేసుల్లో నోటీసులు అందుకున్నారు. ఇంకా కొందరు అయితే ఏకంగా జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా బెంగళూరు రేవంత్ పార్టీ తరువాత తాజాగా బెంగాల్ నటి కూడా రేషన్ స్కామ్ వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. మరి.. ఈమె కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే..మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఈమే జూన్ 5న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి.. అవుతుందా లేదా అనేది జూన్ 5కి తెలుస్తుంది.