రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు కోట్ల రూపాయిలు.. అల్లు అర్జున్ (allu arjun)ఊరఫ్ బన్నీ కోట్ల రూపాయలని వదులుకున్నాడు. రెండు దశాబ్దాలుగా తన నటనతో, డాన్సులతో,ఫైట్స్ తో లక్షలాది మంది అభిమానులను అలరిస్తూ వస్తున్న బన్నీ ఇప్పుడు వాళ్ళ కోసమే కోట్ల రూపాయలను వదులుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అల్లు అర్జున్ చాలా కాలం నుంచి వాణిజ్య ప్రకటనల్లో నటిస్తు వస్తున్నారు. 2018 లో పార్లే ఆగ్రో, ఫ్రూటీ లతో ప్రారంభించి ఆ తర్వాత జొమోటో, రెడ్ బాస్, కేఎఫ్ సి, రాపిడో, కోల్గేట్ మాక్స్ ఫ్రెష్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. అవన్నీ కూడా బన్నీ వల్ల విశేష ఆదరణ పొందాయి. అందుకుగాను భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ని పుచ్చుకున్నాడు. తాజాగా ఇంకో యాడ్ ఆఫర్ కూడా బన్నీ కి వచ్చింది. కానీ అందులో నటించడానికి ఒప్పుకోలేదు. పది కోట్ల రూపాయిల భారీ ఆఫర్ చేసినా కూడా ఒప్పుకోలేదు. పొగాకు ఉత్పత్తికి సంబంధించిన యాడ్ కావడంతోనే రిజెక్ట్ చేసాడు. ఆ యాడ్ నిడివి కేవలం నిమిషం మాత్రమే
ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ తో అల్లు ఆర్మీ మొత్తం తమ హీరో గ్రేట్ అని మురిసిపోతున్నారు. యువకులు చెడు బాట వైపు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 (పుష్ప 2) తో ప్రస్తుతం ఉన్నాడు.పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ మీద అందరి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతున్నాయి. ఆల్రెడీ రీల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆగస్టు 15 న ల్యాండ్ అవ్వడానికి శరవేగంగా ముస్తాబౌతుంది.