సినిమాల మీద ఫ్యాషన్, ఇంట్రస్ట్‌తో ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు వస్తున్నారు. అందులో క్లిక్ అయ్యేది చాలా తక్కువ మందే. ఒకడు ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతే.. మరొకరు చిన్నగా చిన్నగా అడుగులు వేస్తూ.. మూడు, నాలుగు సినిమాలతో స్టార్ డమ్ సంపాదిస్తున్నారు. టైర్ సి హీరోల తర్వాత బి గ్రేడ్ హీరోలతో నటిస్తూ.. స్టార్ హీరోల దృష్టిలో పడతారు. వారి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే చాలు అని భావిస్తుంటారు. ఆ తర్వాత వారి పక్కనే హీరోయిన్లుగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. టాలీవుడ్ పరిశ్రమలో సక్సెస్ అయిన అమ్మాయిల విషయంలో ఇదే నిరూపితమైంది. ఇప్పుడు మరో హీరోయిన్ వరుస సినిమాలతో క్రేజీ బ్యూటీగా మారింది.
ఇదిగో ఈ ఫోటోలో ఓ వ్యక్తి చేతిలో ఒదిగి ఉన్న ఈ పాప.. త్వరలో స్టార్ హీరోయిన్‌గా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చిన్న సినిమాలతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నాయి. వరుస ఆఫర్లతో దూసుకెళుతుంది. ఇటీవల ఓ సినిమాతో మెప్పించింది ఈ బ్యూటీ. ఇంతకు ఆమె ఎవరంటే.. ప్రగతి శ్రీవాత్సవ. ఆయన ఆమె తాత. ఉత్తరప్రదేశ్ వాసి అయిన ప్రగతి మను చరిత్ర మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. శివ కందకూరి హీరోగా వచ్చిన మను చరిత్రలో జానకి పటేల్‌గా కనిపించింది. అందులో మేఘా ఆకాశ్ మెయిన్ హీరోయిన్. అందులో ప్రగతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత పెద కాపు 1 చిత్రంలో యాక్ట్ చేసింది. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెస్మరైజ్ చేసింది ప్రగతి శ్రీ వాస్తవ. లంగా వోణీలతో రంగ స్థలం మూవీలో సమంతను తలపిస్తూ ఉంటుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆనంద్ దేవరకొండతో నటించే అవకాశం కొల్లగొట్టింది. గం గం గణేశ మే 31న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో నీలవేణి పాత్రలో కనిపించింది ప్రగతి. ఇదే కాకుండా మరో చిత్రంలో నటించబోతున్నట్టు కనిపిస్తోంది. చిన్న హీరోల నుండి ఇప్పుడు పెద్ద హీరోలతో నటించే అవకాశాలను కొల్లగొడుతుంది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తెరపై ఎంతో ఒద్దికైన దుస్తులతో ఆకట్టుకునే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం హద్దులు చెరిపేస్తుంది. షార్ట్ దుస్తుల్లోనే కాక పుట్టిస్తూ ఉంటుంది. వెకేషన్స్, ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.