సెలబ్రిటీలు లగ్జరీ కార్లు, బంగాళాలు, విల్లాలు కొనడం కొత్తేం కాదు. అలాగే వాటిని తమ వారికి బహుమతులుగా ఇవ్వడం కూడా కొత్త కాదు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ చేరాడు. తన తమ్ముడికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు లారెన్స్. అయితే తాను ఇలా కాస్ట్లీ కారును బహుమతిగా ఇవ్వడానికి ప్రత్యేక కారణం చెప్పుకొచ్చాడు లారెన్స్. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
రాఘవ లారెన్స్.. తన మంచి మనసుతో ఇతరులకు సాయం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తాడు. సాయం కోరి వచ్చిన వారికి లేదనకుంట అందిస్తూ.. గొప్ప మనసును చాటుకుంటూ వస్తున్నాడు. తాజాగా మరోసారి న్యూస్ లో నిలిచాడు. అయితే ఈసారి తన తమ్ముడికి కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా లారెన్స్ వెల్లడించాడు. తన తమ్ముడు ఎల్విన్ ను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నాడు లారెన్స్. ‘బుల్లెట్’ పేరుతో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలైంది.
ఈ కోరికనే విడుదలకు ముందు సినిమా చూసిన రాఘవ లారెన్స్.. తన తమ్ముడి నటనకు ఫిదా అయ్యాడు. “నేను నా తమ్ముడు నటించిన తొలి మూవీ ‘బుల్లెట్’ చూశాను. అందులో అతడి నటన అద్భుతం. అందుకే అతడికి ఇది నా గిఫ్ట్ గా ఇస్తున్నాను. నేను ఇది గౌరవంగా భావిస్తున్నాను. యూనిట్ మెుత్తానికి నా అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు. ఎల్విన్ ఫెర్పామెన్స్ నచ్చడంతో MG హెక్టార్ కారును బహుమతిగా ఇచ్చాడు. దాని ధర మార్కెట్ లో రూ. 20 లక్షల పైనే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను లారెన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘జిగర్తండ డబుల్ ఎక్స్’ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం తమిళంలో రెండు మూవీలు చేస్తున్నాడు లారెన్స్. తెలుగులో అతడికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి తమ్ముడికి కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.