వెండితెరపై ఛాన్స్ రావడం ఏ జన్మలో చేసిన పుణ్యమో అంటారు. ప్రస్తుతం వెండి తెరపై చాలా మంది నట వారసులు, చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు హీరోహీరోయిన్లు కావడం, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతున్న విషయం తెలిసిందే. కొత్త ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకోవడం అనేది టాలెంట్ మాత్రమే కాదు.. అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు. సినీ ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ వచ్చిందంటే చాలు.. సెలబ్రెటీ హోదా లభిస్తుందని ఫీల్ అవుతారు. అందరూ అనుకున్నట్లు సినిమా రంగం గ్లామర్ ప్రపంచమే కాదు.. అంతులేని కన్నీటి కథలు ఉన్నాయని కొంతమంది నటినటుల జీవితాలు చూస్తుంటే అర్థమవుతుంది. అందం.. అభినయం ఆమె సొంతం.. స్టార్ హీరోలు ఆమె సరసన నటించాలని కోరుకునే వారు. కానీ విధి ఆమెను వెక్కిరించింది.. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు.. ఆమెకు వచ్చిన కష్టం ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ కమెడియన్ కృష్ణమూర్తి, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎంఎల్ వసంత కుమారి దంతపతులకు జన్మించింది శ్రీవిద్య. ఆమె పుట్టిన ఏడాదికి అనుకోకుండా కృష్ణమూర్తి అనారోగ్యంతో మంచానపడ్డారు. దీనితో నటనకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఆ కుటుంబం పోషణ మొత్తం వసంత కుమారిపైనే పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల శ్రీ విద్య తన 14వ ఏటనే ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. శివాజీ గణేషన్ హీరోగా నటించిన ‘తిరువరుచెల్వర్’ అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగులో శ్రీ విద్య నటించిన మొదటి చిత్రం పేదరాశి పెద్దమ్మ. చక్కటి ముఖ వచ్ఛస్సు, నాట్యం అన్నీ శ్రీ విద్య సొంతం. తెలుగు లో దాసరి నారాయణరావు ఆమెను ఎక్కువగా ప్రోత్సహించారు.
తమిళ ప్రముఖులు కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ మూవీలో రజినీకాంత్, కమల్ హాసన్ నటించారు. ఈ మూవీని తెలుగులో తూర్పూ పడమర పేరుతో రిమేక్ చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది. రెండు భాషల్లో హీరోయిన్ గా శ్రీ విద్య నటించి మెప్పించింది. అప్పట్లో శ్రీవిద్య, కమల్ జంటగా ఎన్నో సినిమాలు వచ్చాయి..రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు కొన్ని కారణాల వల్ల ఇద్దరూ బ్రేకప్ చెప్పారు. 1978లో మాలీవుడ్ దర్శకుడు జార్జ్ థామస్ ని పెళ్లి చేసుకుంది శ్రీ విద్య. పెళ్లైన తర్వాత భర్త కోరిక మేరకు ఇండస్ట్రీకి దూరమైంది శ్రీ విద్య. రెండు సంవత్సరాల తర్వాత ఆర్థిక కష్టాలు రావడంతో మళ్లీ సినిమాల్లో నటించి సంపాదించడం మొదలు పెట్టింది. ఆమె సంపాదిస్తుంటే భర్త జార్జ్ ఖర్చులు చేసే పనిలో పడ్డారు.
ఈ విధంగానే ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో 1980లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. 2003లో శ్రీ విద్య అనారోగ్యానికి గురైంది. ఆమె రొమ్ము క్యాన్సర్ రావడంతో తాను ఎంతో కాలం బ్రతకనని అర్థమైపోయింది. ఈ విధంగానే తన పేరుపై ఎలాంటి ఆస్తి ఉండకూడదు అని నిర్ణయం తీసుకుంది. సంగీత, నృత్య కళాశాలల్లో విద్యార్థులకు ప్రోత్సాహక షిప్ అందడం లేదని తెలుస్తుంది. వెంటనే నటుడు గణేష్ సహాయంతో ఒక ట్రస్ట్ ని రిజిస్ట్రర్ చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా అర్హులైన వారికి సహాయం అందేలా చేశారు. ఆ రోజుల్లోనే శ్రీ విద్యకు కోట్ల ఆస్తులు.. వాటన్నింటిని ఆపదలో ఉన్నవారి సాయం అందించడం.. ట్రస్ట్ ద్వారా విద్యార్థులను ఆదుకోవడం జరిగింది. మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్ తో పోరాడిన ఆమె 2006 అక్టోబర్ 19 న తన 53 వ ఏటా కన్నుమూశారు. ఆమె మరణంపై సినీ ఇండస్ట్రీనే కాదు.. విద్యార్థి లోకం శోక సంద్రంలో మునిగిపోయింది.