బాలకృష్ణ (balakrishna)బోయపాటి శ్రీను (boyapati srinu)కాంబో కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. 2010లో ఏ ముహూర్తాన సింహా స్టార్ట్ చేసారో గాని.. విశ్వం ఉన్నంత కాలం ఆ ఇద్దరి కాంబోలో సినిమాలు వస్తూనే ఉండాలని కోరుకుంటారు.ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ కాంబో మూవీ కోసం అవసరమైతే వాళ్లే ఇద్దరి నిర్మాతలుగా మారతారు. అంత క్రేజ్ ఉంది మరి.. వరుసగా సింహా,లెజండ్, అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్లతో సిల్వర్ స్క్రీన్ వద్ద పెద్ద బీభత్సమే సృష్టించారు. పైగా అసలు సిసలు తెలుగు సినిమాకి అర్ధం కూడా చెప్పారు. తాజాగా బోయపాటి కి సంబంధించిన ఒక వార్త బాలయ్య ఫ్యాన్స్ లో హుషారుని తెస్తుంది.
బాలకృష్ణ,బోయపాటి కాంబోలో అఖండ 2 (అఖండ 2)ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల రామ్ పోతినేని తో స్కంద చేసిన బోయపాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ అఖండ 2 నే.ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం అఖండ 2 మీదే ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం షూట్ కి. ఇక ఈ లోపు బోయపాటి మిగతా కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు.విలన్స్ వేటలో పడ్డాడనే వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ కి ధీటుగా ఉండే విలన్ కోసం సెర్చ్ చేసాడు. .ఒకప్పటి హీరోలు ఇప్పటి విలన్స్ అయిన సంజయ్ దత్, బాబీ డియోల్ ని సంప్రదిస్తున్నాడు. ఆ ఉంటారా లేక వారిలో ఒకరా అనేది ఇద్దరు రోజుల్లో తెలుస్తుంది. బోయపాటి విలన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. పర్టిక్యులర్ గా బాలయ్య విలన్ కి కొంచం ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎవరు ఊహించని విధంగా లెజండ్, అఖండ లో శ్రీకాంత్, జగపతి బాబు లని ఫిక్స్ చేసాడు.అదే విధంగా ఇంకో కొత్త వ్యక్తి ని విలన్ గా పరిచయం చేస్తాడేమో చూడాలి.
అఖండ హిట్ కావడంతో అఖండ 2 మీద అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అఘోరా క్యారక్టర్ లో బాలయ్య నట విశ్వరూపం ఏ స్థాయిలో ఉండబోతుందో అనే ఆసక్తి కూడా ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ వాల్తేరు వీరయ్య తో చిరంజీవి (చిరంజీవి)కి ఆదిరిపోయే హిట్ ఇచ్చిన బాబీ (బాబీ)డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకుంది. ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే మిగిలిన షూట్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత అఖండ 2 లో పాల్గొంటాడు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్ నిర్మిస్తాడనే టాక్ ఉంది. అఖండ పార్ట్ 1 ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు.