గతంలో ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే.. ఆ సినిమా ఎలా అయినా చూడాలని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా థియేటర్లకు వెళ్లి ఆయా సినిమాలను చూసే వారు. కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చేశాయి.. ఇంట్రెస్ట్ ఉన్న వారు థియేటర్లకు వెళ్తున్నారు. లేదంటే ఆయా సినిమాలు ఓటీటీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా నెల రోజుల తర్వాత ఓటీటీ లోకి రావాలి అనేది రూల్. కానీ ఇప్పుడు అసలు ఇలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయో లేదో నెల తిరగకముందే ఓటీటీ లో ప్రత్యేక్షం అవుతున్నాయి. ఇప్పుడు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించిన “లవ్ మీ” సినిమా పరిస్థితి కూడా అలానే అయింది. ఈ సినిమా ఓటీటీ డేట్ ఇదే అంటూ బజ్ నడుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వైష్ణవి చైతన్య, ఆశిష్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ “లవ్ మీ”. ఈ సినిమా హర్రర్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రదర్శించబడింది. ట్రైలర్ రిలీజ్ దగ్గరనుంచి ఈ సినిమాపై కాస్త అంచనాలు పెంచారు ప్రేక్షకులు. ఈ సినిమా మే 25న థియేటర్లలో విడుదలైంది. కానీ, అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు. కాన్సెప్ట్ పరంగా సినిమా బాగున్నా కూడా ప్రెసెంటేషన్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయిందంటూ టాక్ వినిపించింది. దీనితో అనుకున్న రేంజ్ లో ఈ సినిమా విజయం అందుకోలేకపోయింది. ఇక ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం ఆహ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఈ బజ్ నడుస్తుంది ఏమో కానీ.. ఈ సినిమా నెల గడవకముందే ఓటీటీలోకి వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. లవ్ మీ మూవీ జూన్ 15 లేదా 22 నుంచి ఓటీటీ లో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక లవ్ మీ మూవీ కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఓ యూట్యూబర్.. దెయ్యాలు లేవని నిరూపించడానికి.. కొన్ని వీడియోలు చేస్తూ దాని నుంచి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఓ రోజు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని ఓ ఊరిలో దివ్యవతి అనే ఓ దెయ్యం ఉందని, ఆమెను చూసిన వారు ప్రాణాలతో తిరిగి రాలేదని హీరోకు తెలుస్తుంది. దీనితో దివ్యవతిని వెతుక్కుంటూ.. హీరో తన అన్నయ్యతో కలిసి ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ దివ్యవతి గురించి హీరో ఏం తెలుసుకుంటాడు ? ఆ దెయ్యాన్ని ప్రేమించాలని హీరో ఎందుకు అనుకుంటాడు ? అతని ప్రేమ కథ ఎంత వరకు సాగింది ? ఈ సినిమాలో వైష్ణవికి హీరో మధ్య సంబంధమేంటి ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.