ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో బంపర్ తంబోలా ను, ఉత్సాహభరిత వాతావరణంలో అత్యంత ఘనంగా జరిగింది. ఎఫ్.ఎన్.సి.సి సభ్యులు, కుటుంబ సభ్యులు, అతిథులు మరియు మహిళలు అధిక సంఖ్యలో ఈ బంపర్ తంబోలాలో ఉన్నారు. ఈ బంపర్ తంబోలాలో గెలిచిన వారికి 5 రౌండ్స్ ఐదు కార్లు ఆల్టో, సెలెరియో, టాటా టియాగో, టొయోటా గ్లాంజా మరియు బంపర్ ప్రైజ్ మెర్స్ బెంజ్ ఎ క్లాస్. బెంజ్ గెలిచిన విన్నర్స్ సత్నం కౌర్ మరియు డి. సాయికిరణ్. బంపర్ తంబోలా విన్నర్స్ కు సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగ రావు, మరియు నందమూరి వసుంధర చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ జుజాల, బాలరాజు, గోపాల రావు, ఏడిద రాజా, మోహన్ వడ్లపట్ల, సామ ఇంద్రపాల్ రెడ్డి, తంబోల కమిటీ సభ్యులు స్వరూప, చేతన, రోహిణి, శైలజ, హకీమ్ ఉన్నారు. ఈ ఫీచర్ స్పాన్సర్స్ నవనామి – మెగాలియో, డి ఎస్ ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సన్ షైన్ డెవలపర్స్, మెర్సిడీస్ బెంజ్ సిల్వర్ స్టార్, శ్రీ మిత్ర టౌన్‌షిప్స్, కిమ్స్ హాస్పిటల్స్, ప్రజ్ఞ హాస్పిటల్స్, ఎన్‌ఎస్‌ఎల్ ఇన్‌ఫ్రాటెక్, హర్ష ఆటో, మంది, ప్రకృతి ఎవెన్యూస్ & వంశీరాం బిల్డర్స్.
ఈ సందర్భంగా సెక్రటరీ ముళ్లపూడి మోహన్.. “గతంలో కూడా మేము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం. అప్పుడు కమిటీ ప్రస్తుత కమిటీ సపోర్ట్ ద్వారానే ఇది అంతా జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సభ్యులకు రిలాక్సేషన్ లభిస్తుంది. లోనే నెంబర్ వన్ క్లబ్ గా రూపొందించబడింది.కమిటీ సభ్యులతో పాటు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం.