ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ ఎంట్రీతో పాటు.. పాత హీరోయిన్స్ రీ ఎంట్రీ కూడా జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో హీరోయిన్ తో పాటు ఓ వెలుగు వెలిగిన కొందరు .. అనేక కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైపోతారు. ఆ తర్వాత సడెన్ గా కొన్ని సినిమాల ద్వారా సడెన్ గా రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అంతే. ఆమె మరెవరో కాదు మీరా జాస్మిన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం నిర్మాణం సినిమా “స్వాగ్. మీరా జాస్మిన్ రీఎంట్రీ ఇస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మీరా జాస్మిన్ .. ఈ అమ్మడిని అంత ఈజీగా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఎందుకంటే ఆమె తన సినిమాలలో తన నటనతో.. తెలుగు ప్రేక్షకులకు అంత దగ్గరైంది. అమ్మాయి బాగుంది సినిమా తెలుగుతో సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి.. తన కంటూ ప్రత్యేకత సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆమె ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. ఇక ఆమె తెలుగులో చివరిగా కనిపించినా సినిమా విమానం. ఈ సినిమాతోనే తిరిగి తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు మీరా జాస్మిన్. ఇక ఇప్పుడు ఆమె నటిస్తున్న మరొక సినిమా స్వాగ్. ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో మీరా జాస్మిన్ కీ రోల్ లో కనిపించనట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్స్ ను రివీల్ చేశారు మేకర్స్. దీనితో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహారాణి లుక్ లో కనిపిస్తున్న మీరా జాస్మిన్ ఫోటో.. ఈ సినిమాపై ఇంకాస్త ఆసక్తిని పెంచుతోంది.
ఇక స్వాగ్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ సృష్టించారు. కాగా ఈ చిత్రానికి హసిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ గతంలో శ్రీ విష్ణు, హసిత్ కాంబినేషన్ లో రాజా రాజా చోర అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈసారి రాబోయే సినిమా ప్రేక్షకులు ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .
ఇదిగో తీసుకొచ్చాం
ది వరల్డ్ ఆఫ్ #అక్రమార్జన మా అందరి హృదయాలను పాలించిన రాణిని మీ ముందుకు తీసుకువస్తుంది, #మీరాజాస్మిన్ ఆన్-బోర్డ్
మా #అచ్చతెలుగుసినిమా స్టోర్లో చాలా ఉంది.
కలుపు గోలు @sreevishnuoffl @riturv @విశ్వప్రసాద్ @హసిత్గోలి @ప్రజలు @vivekkuchibotla #కృతిప్రసాద్… pic.twitter.com/fmoIkmvuhX— పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (@peoplemediafcy) జూన్ 2, 2024